NTV Telugu Site icon

Koti Deepotsavam LIVE : శ్రీశైలం శ్రీ మల్లికార్జున కల్యాణం

Koti Deepotsavam

Koti Deepotsavam

ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జరుగుతోన్న కోటిదీపోత్సవం నేటితో ముగియనుంది.. అక్టోబర్‌ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం.. ఇవాళ్టితో ముగుస్తుంది… ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగుతోంది.. శంఖారావంతో ప్రారంభమైన పదిహేనవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. వేదపఠనం : శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల – వర్గల్, భక్తి గీతాలు : పర్ణిక బృందం, వేణుగానం : జయప్రద రామ్మూరి బృందం, కొల్హాపూర్ కరవీరపుర నివాసినీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు.. హారతి, కోటి దీపోత్సవంలో పదిహేనవ రోజు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృతం.. దీపం ప్రాముఖ్యత.. కోటి దీపోత్సవ వైశిష్ట్యం గురించి సద్గురు వారి సందేశం..

Read Also: Koti Deepotsavam 2022: చివరి రోజు కోటి దీపోత్సవం… ఈరోజు విశేష కార్యక్రమాలు

భక్తుల కోరికలు నెరవేర్చే పండరీపురం శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి పరిణయం.. కోటి జన్మాల పాపాలను నశింపజేసే శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం.. శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మఠం. సద్గురు శ్రీ రితేశ్వర్ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, శ్రీ ఆనందం ధమ్ ట్రస్ట్ వ్రిందవన్, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ (బృందావన్ ఆనందామ్ పీఠాధిపతి – శ్రీరితేశ్ జీ మహారాజ్).. ఆనందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపే దీప పండుగలో అఖండ జ్యోతి ప్రజ్వలన.. దీపకాంతుల సంబరాలలో సప్త హారతుల వీక్షణం.. ఎక్కడా చూడని మహాద్భుతం.. మహాదేవుని మహా నీరాజనం.. లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Koti Deepotsavam Advertisement