Rajyogam: నేడు (2026 సెప్టెంబర్ 14న) గణేశ్ చతుర్థి సందర్భంగా అరుదైన జ్యోతిష్య సంయోగం ఏర్పడుతున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రోజు బుధుడు కన్య రాశిలో, శుక్రుడు తుల రాశిలో ఉండటంతో ‘భద్ర పంచమహాపురుష రాజయోగం, మాలవ్య పంచమహాపురుష రాజయోగం’ ఒకేసారి ఏర్పడే పరిస్థితి ఉందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. దాదాపు 200 ఏళ్ల తర్వాత ఇలాంటి కలయిక ఏర్పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
భద్ర రాజయోగం?
పంచమహాపురుష రాజయోగాల్లో భద్ర యోగం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన సొంత రాశి అయిన మిథునం లేదా కన్యలో, అలాగే కేంద్ర స్థానంలో బలంగా ఉన్నప్పుడు భద్ర యోగం ఏర్పడుతుందని చెబుతారు. ప్రస్తుతం బుధుడు కన్య రాశిలో సంచరిస్తున్నాడు. కన్య రాశి బుధుడి స్వరాశితో పాటు మూలత్రికోణ రాశిగా కూడా పరిగణిస్తారు. దీంతో బుధుడి స్థానం బలంగా ఉంటుందని జ్యోతిష్య నమ్మకం. బుధుడిని బుద్ధి, వాక్చాతుర్యం, తర్కం, విద్య, రచన, లెక్కలు, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ రంగాలకు సంబంధించిన వారికి భద్ర యోగం అనుకూల ఫలితాలను అందిస్తుందని చెబుతారు.
మాలవ్య రాజయోగం:
మరోవైపు శుక్రుడు ప్రస్తుతం తన స్వరాశి అయిన తులలో సంచరిస్తున్నాడు. శుక్రుడు తన స్వరాశి లేదా ఉచ్చ రాశిలో కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు మాలవ్య పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్రుడిని సంపద, విలాసం, ప్రేమ, అందం, కళలు, వాహనాలు, భౌతిక సుఖాలు, ఐశ్వర్యానికి కారకుడిగా పరిగణిస్తారు. అందువల్ల మాలవ్య యోగం ఆర్థిక పరిస్థితులు, సుఖసంతోషాలు, కెరీర్, భౌతిక సౌకర్యాల పరంగా శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య విశ్వాసం.
ఈ యోగాల ప్రభావం ప్రతి వ్యక్తిపై ఒకే విధంగా ఉండదు. జన్మకుండలిలో గ్రహాల స్థానం, లగ్నం, దశలు తదితర అంశాల ఆధారంగా ఫలితాలు మారుతాయని జ్యోతిష్య నమ్మకం. ఈ 5 రాశులకు అనుకూల ఫలితాలు..
మిథున రాశి:
మిథున రాశి వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, పరిచయాల ద్వారా ప్రయోజనాలు కలగవచ్చు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఆర్థికంగా సానుకూల మార్పులు రావచ్చని చెబుతున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉండవచ్చు.
కన్య రాశి:
కన్య రాశిలోనే బుధుడు సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి భద్ర యోగం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం. నిర్ణయ సామర్థ్యం, తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు.
తుల రాశి:
శుక్రుడు తన స్వరాశి అయిన తులలో ఉండటంతో మాలవ్య యోగం ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. ధనం, కెరీర్, సుఖసౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది.
మకర రాశి:
మకర రాశి వారికి కెరీర్ పరంగా ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించవచ్చు. కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా ఉద్యోగంలో మార్పులకు సంబంధించిన అవకాశాలు రావచ్చు.
జ్యోతిష్య గణనల ప్రకారం బుధుడు 2026 సెప్టెంబర్ 26 వరకు కన్య రాశిలో ఉంటాడని చెబుతున్నారు. ఆ తర్వాత తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో భద్ర యోగం ప్రస్తుత దశ సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరోవైపు శుక్రుడు 2026 నవంబర్ 6 వరకు తుల రాశిలో ఉంటాడని పేర్కొంటున్నారు. అందువల్ల మాలవ్య యోగం ప్రభావం నవంబర్ ప్రారంభం వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. అంటే సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 26, 2026 వరకు భద్ర, మాలవ్య రాజయోగాలు ఒకేసారి ఉండే కాలంగా జ్యోతిష్య పరంగా ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. అయితే ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారిత అంచనాలు మాత్రమే.. వ్యక్తిగత ఫలితాలు జన్మకుండలిని బట్టి మారవచ్చు.

