NTV Telugu Site icon

Oben Rorr: స్టైలిష్ లుక్లో ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతో తెలుసా.?

Oben Rorr

Oben Rorr

ఉత్తర భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్‌ను ఢిల్లీలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన మొదటి డీలర్‌షిప్‌ను ఢిల్లీలోని పితంపురాలో ప్రారంభించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.

ONGC Recruitment : రాత పరీక్ష లేకుండా 262 పోస్టులను భర్తీ.. భారీగా జీతాలు..

మొదటి 100 మంది కస్టమర్‌లు ప్రయోజనాలను పొందుతారు:
ఈ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించడంతో.. ఉత్తర భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పెద్ద ప్రణాళికలు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మరో 12 కొత్త షోరూమ్‌లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను మొదటి 100 మంది వినియోగదారులకు కేవలం రూ.1.10 లక్షలకే అందించనుంది. దీని అసలు ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కంపెనీ ఈ బైక్ కు స్పోర్టీ లుక్ డిజైన్‌ని ఇచ్చింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. రోజువారీ ప్రయాణీకులకు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్తమ ఎంపిక అని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ కు వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీటు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ వాటర్ వేడింగ్ కెపాసిటీ దాదాపు 230 మి.మీ. అంటే వరదలున్న రోడ్లపై కూడా సులభంగా నడపవచ్చు.

ఈ బైక్‌లో.. కంపెనీ 4.4 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఇది 10kW ఎలక్ట్రిక్ మోటారుకు అనుసంధానించబడి ఉంది. ఈ మోటార్ గరిష్టంగా 62Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 40 కిమీ వేగాన్ని అందుకోగలదని.. దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ అని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌కు 3 రైడింగ్ మోడ్‌లు ఇచ్చారు. ఇందులో ఎకో, సిటీ మరియు హవోక్ ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిమీల వరకు డ్రైవింగ్ చేయగలదని కంపెనీ ఒబెన్ పేర్కొంది. దీన్ని ఇంట్లో ఉండే సాకెట్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఛార్జ్ అవుతుంది. ఈ బైక్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. మార్కెట్‌లో దీని ప్రత్యక్ష పోటీ Revolt RV400తో ఉంది.