Yezdi Roadster 2025: యెజ్డి (Yezdi) తన ప్రముఖ క్రూజర్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ అప్‌డేట్ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో కొన్ని కొత్త కాస్మెటిక్ అప్‌డేట్స్ ఇచ్చారు. అయితే ఇంజిన్, కొన్ని మెకానికల్ భాగాల విషయంలో పెద్ద మార్పులు చేయలేదు. యెజ్డి దీపావళి 2025 నాటికి దేశవ్యాప్తంగా 450 సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2025 యెజ్డి రోడ్‌స్టర్ (Yezdi Roadster) 334cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఆల్ఫా 2 ఇంజిన్‌తో వస్తుంది. దీన్ని 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో జత చేశారు. ఈ ఇంజిన్ 29.6 bhp పవర్, 29.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇదివరకు మోడల్ డిజైన్ ను కొనసాగిస్తూ కొత్త రోడ్‌స్టర్‌లో రౌండ్ LED హెడ్‌లైట్, హైడ్రోఫార్మ్ హ్యాండిల్‌బార్లు, టీర్‌డ్రాప్ ఆకార ట్యాంక్, తొలగించగల రియర్ సీట్, టూరింగ్ వైజర్లు, ట్విన్-రాడ్ క్రాష్ గార్డులు ఫ్రేమ్ స్లైడర్లతో ఉన్నాయి. ఈ కొత్త బైకు 795mm సీట్ హైట్, 1440mm వీల్‌బేస్‌తో వస్తుంది.
అలాగే ఇందులో బ్రేకింగ్ కోసం కాంటినెంటల్ నుండి డ్యూయల్-చానల్ ABS, 320mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 240mm రియర్ డిస్క్ బ్రేక్‌లను అందించారు. అంతేకాకుండా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ రియర్ షాక్స్ స్థిరత్వం, సౌకర్యం కోసం ట్యూన్ చేయబడ్డాయి. ఈ కొత్త 2025 యెజ్డి రోడ్‌స్టర్ షార్క్ స్కిన్ బ్లూ, స్మోక్ గ్రే, బ్లడ్ రష్ మెరూన్, సావేజ్ గ్రీన్, షాడో బ్లాక్ వంటి ఐదు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది.
Jaya Bachchan: సెల్పీ కోసం ఆరాటం.. అభిమానిని తోసేసిన జయా బచ్చన్..
ఈ కొత్త యెజ్డి రోడ్‌స్టర్ Sharkskin Blue వెరియంట్ ధర రూ. 2,09,969, Smoke Grey వెరియంట్ రూ.2,12,969, Bloodrush Maroon వెరియంట్ రూ.2,16,969, Savage Green వెరియంట్ రూ.2,21,969గా నిర్ణయించబడింది. అత్యంత ప్రీమియం కలర్ ఆప్షన్‌గా ఉన్న Shadow Black వెరియంట్ ధర రూ.2,25,969 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ అన్ని వెరియంట్లు తమ ప్రత్యేకమైన కలర్ ఫినిషింగ్, స్టైల్‌తో బైక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి.
