Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్‌తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
- యమహా కొత్త బైక్ వచ్చేసింది
- 26.1bhp పవర్‌తో YZF-R2 విడుదల
- ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamaha YZF-R2: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు యమహా గుడ్ న్యూస్ చెప్పింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Yamaha కొత్త YZF-R2ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్పోర్టీ డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ 200cc సెగ్మెంట్లో ఆసక్తికరమైన మోడల్‌గా నిలుస్తోంది. కొత్త Yamaha YZF-R2 ప్రారంభ ధర రూ.2,30,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కంపెనీ దీనిని మూడు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. 2026 సెప్టెంబర్ మధ్య నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
204cc ఇంజిన్.. 26.1bhp పవర్
Yamaha YZF-R2లో 204cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 26.1bhp పవర్, 19.1Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఇందులో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అందుబాటులో ఉంటుంది. స్పోర్ట్స్ రైడింగ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కంపెనీ ఈ బైక్‌లో పలు ఎలక్ట్రానిక్ ఫీచర్లను కూడా అందించింది.
Also Read
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
మూడు రైడింగ్ మోడ్లు
రైడర్ అవసరాలకు అనుగుణంగా కొత్త YZF-R2లో మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. Street Mode, Sport Mode, Rain Mode వాతావరణం, రహదారి పరిస్థితులకు అనుగుణంగా రైడర్ వీటిని మార్చుకోవచ్చు. అంతేకాకుండా అన్ని వేరియంట్లలో Traction Control Systemను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
మూడు వేరియంట్లు.. ధరలు ఇవే
YZF-R2 Standard-రూ.2,30,500-Metallic Black, Dark Bluish Gray
YZF-R2 Quick Shifter-రూ.2,39,500-Matte White Pearl, Racing Blue
YZF-R2 M -రూ.2,53,000-Metallic Gray
మిడ్-స్పెక్ Quick Shifter, టాప్-ఎండ్ R2 M వేరియంట్లలో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అందుబాటులో ఉంటుంది. దీంతో క్లచ్‌ను ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా వేగంగా గేర్లను మార్చుకోవచ్చు.
R15 కంటే మరింత అగ్రెసివ్ డిజైన్
డిజైన్ విషయంలో కొత్త Yamaha YZF-R2కు స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ ఇచ్చారు. పదునైన హెడ్‌ల్యాంప్ డిజైన్, ఏరోడైనమిక్ బాడీ లైన్స్ కారణంగా బైక్‌కు ప్రీమియం స్పోర్ట్స్ బైక్ రూపం లభించింది. Yamaha R-సిరీస్‌కు ఉన్న స్పోర్టీ డిజైన్ ఫిలాసఫీని కొనసాగిస్తూ కొత్త R2ను రూపొందించారు. R15తో పోలిస్తే మరింత దృఢమైన, అగ్రెసివ్ స్టైలింగ్‌తో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది.
TFT డిజిటల్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
ఫీచర్ల విషయంలోనూ YZF-R2 ఆకట్టుకునే విధంగా ఉంది. బైక్‌లో TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అందించారు. దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. టాప్ వేరియంట్ R2 Mలో Smart Key Systemను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీంతో కీని ఉపయోగించకుండానే బైక్‌ను స్టార్ట్ చేయడం వంటి సౌకర్యాలు లభిస్తాయి.
సస్పెన్షన్, హార్డ్‌వేర్
కొత్త YZF-R2లో ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. దీంతో స్పోర్టీ రైడింగ్ సమయంలో బైక్ హ్యాండ్లింగ్, స్టెబిలిటీ మెరుగుపడే అవకాశం ఉంది. టాప్-ఎండ్ R2 M వేరియంట్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ లివర్స్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.
KTM RC 200, Karizma XMRలకు పోటీ?
కొత్త Yamaha YZF-R2 200cc పెర్ఫార్మెన్స్ బైక్ సెగ్మెంట్లోకి రావడంతో KTM RC 200, Hero Karizma XMR 210 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, TFT కన్సోల్, క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లు స్పోర్ట్స్ బైక్ కొనుగోలుదారులను ఆకట్టుకునే అంశాలుగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్‌తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్‌లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్‌లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!