కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- యమహా 2026 మోడల్ ఎఫ్ఐ లైనప్ అప్డేట్..
- రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లకు..
- కొత్త కలర్ ఆప్షన్స్, రివైజ్డ్ గ్రాఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yamaha 125cc 2026 Models: ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ లైనప్‌ను 2026 కోసం అప్డేట్ చేసింది. ఇందులో భాగంగా RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్ స్కూటర్లకు కొత్త కలర్ ఆప్షన్స్, రివైజ్డ్ గ్రాఫిక్స్‌తో పాటు కొన్ని కొత్త ఫీచర్లను అందుకుంది. ముఖ్యంగా RayZR స్ట్రీట్ ర్యాలీలోని ఎంపిక చేసిన వేరియంట్లకు TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు అందించారు.
కొత్త కలర్స్, గ్రాఫిక్స్:
2026 మోడల్ ఇయర్ కోసం యమహా రెండు స్కూటర్ సిరీస్‌ల లుక్‌ను రిఫ్రెష్ చేసింది. కొత్త పెయింట్ స్కీమ్స్, అప్డేటెడ్ గ్రాఫిక్స్‌ను తీసుకొచ్చింది. అయితే స్కూటర్ల ప్రాథమిక డిజైన్, మెకానికల్ ప్యాకేజీలో పెద్దగా మార్పులు చేయలేదు. RayZR 125 Fi హైబ్రిడ్ స్పోర్టీ డిజైన్‌ను కొనసాగిస్తుండగా.. ఫాసినో 125 Fi హైబ్రిడ్ తనకు ప్రత్యేకమైన రెట్రో ప్రేరిత స్టైలింగ్‌ను అలాగే కొనసాగిస్తోంది.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
TFT డిస్ప్లే:
2026 అప్డేట్లో కొత్తగా ఎంపిక చేసిన RayZR స్ట్రీట్ ర్యాలీ వేరియంట్లలో TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ను అందించారు. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు రైడ్‌కు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా డిస్ప్లేలో చూడవచ్చు. అంతేకాకుండా “యమహా ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్”ను కూడా అందించింది. రద్దీగా ఉన్న పార్కింగ్ ప్రదేశాల్లో మన స్కూటర్‌ను సులభంగా గుర్తించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
మెకానికల్ మార్పులు:
కొత్త మోడల్స్‌లో ప్రధానంగా డిజైన్, ఫీచర్లపైనే యమహా దృష్టి పెట్టింది. RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో125 Fi హైబ్రిడ్ రెండింటిలోనూ కంపెనీ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) హైబ్రిడ్ సిస్టమ్ కొనసాగుతుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ యాక్సిలరేషన్ సమయంలో అదనపు సహాయాన్ని అందిస్తుంది. అలాగే “స్టాప్ & స్టార్ట్ సిస్టం”తో కలిసి పనిచేస్తూ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
125cc ఇంజిన్:
రెండు స్కూటర్లలోనూ ఇప్పటికే ఉన్న 125cc పవర్ట్రెయిన్నే కొనసాగించారు. ఇంజిన్, ట్రాన్స్మిషన్, ఇతర ప్రధాన మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి కీలక మార్పులు చేయలేదు. అంటే 2026 అప్డేట్లో ప్రధానంగా కొత్త కలర్స్, గ్రాఫిక్స్, TFT డిస్ప్లే, నావిగేషన్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను మాత్రమే జోడించారు. దీంతో ఇప్పటికే ఉన్న మెకానికల్ ప్యాకేజీని కొనసాగిస్తూనే స్కూటర్లను మరింత ఆధునికంగా మార్చే ప్రయత్నం యమహా చేసింది.
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!