NTV Telugu Site icon

Xiaoma Electric Car : కేవలం రూ. 3.47 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 1200కి.మీ!

Xiaomi Small Electric Car

Xiaomi Small Electric Car

చైనీస్ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన బెస్ట్యూన్ బ్రాండ్ గత ఏడాది తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే వార్తల్లో నిలిచింది. దీనికి అసలు కారణం.. ఈ కారులో మంచి ఫీచర్లతో పాటు.. చాలా తక్కువ ధరకు లభిస్తుంది. వాస్తవానికి, కంపెనీ బ్యాటరీకి సంబంధించిన సాంకేతికతను సృష్టించింది. ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది. రేంజ్ కూడా అధికంగా ఉంది. ఈ టెక్నాలజీతో కంపెనీ షియోమీని లాంచ్ చేసింది.

READ MORE: Hyderabad: సొంత అక్కని చంపుతాడని అనుకోలేదు.. మృతురాలు నాగమణి భర్త

బెస్టూన్ షావోమా ధర సుమారు రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షల వరకు ఉంది. ఈ కారుతో కంపెనీ మైక్రో-ఈవీ విభాగంలో తన వాటాను పెంచుకోవాలనుకుంటోంది. ఈ మైక్రో ఎలక్ట్రిక్ కార్లకు చైనాలో అత్యధిక డిమాండ్ ఉంది. ఇప్పుడు భారత మార్కెట్‌లో దీన్ని ప్రవేశ పెట్టేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. భారత ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కంపెనీ కూడా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు కంపెనీ మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. ఇది టాటా టియాగో ఈవీ, ఎమ్‌జీ కామెట్ ఈవీలతో పోటీ పడనుంది.

READ MORE:Botsa Satyanarayana: విద్యుత్ చార్జీలు పెంచడంపై ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నారు!

కార్ ఫీచర్స్..
ఇది 7-అంగుళాల యూనిట్. డ్యాష్‌బోర్డ్ ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ థీమ్‌ కలిగి ఉంటుంది. షావోమా యానిమేషన్ ఫిల్మ్ నుంచి నేరుగా కనిపించే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది. ఇది మరింత ఆకర్షణీయమైన ప్రొఫైల్ కోసం రౌండ్ కార్నర్స్‌తో పెద్దగా రౌండ్ హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు. ఇందులో ఏరోడైనమిక్ వీల్స్‌ను ఉపయోగించారు. ఈ వీల్స్ వెహికల్ రేంజ్‌ను మరింత పెంచుతాయి. ఈ బెస్ట్యూన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1200కిమీ రేంజ్ ఇస్తుంది. Shaoma FME ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈవీ రేంజ్ ఎక్స్‌టెండర్ డెడికేటెడ్ ఛాసిస్ ఇందులో చేర్చబడ్డాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌పై NAT అనే రైడ్-హెయిలింగ్ ఈవీని తయారు చేశారు. FME ప్లాట్‌ఫారమ్‌లో A1, A2 అనే రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. A1 ప్లాట్‌ఫారమ్ 2700-2850 mm వీల్‌బేస్ కలిగి ఉన్న సబ్‌కాంపాక్ట్‌లు అందిస్తుంది. A2 2700-3000 mm వీల్‌బేస్ ఉన్న కార్ల కోసం ఉపయోగించబడుతుంది.