World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
- World EV Day 2026: 212 కి.మీ వరకు రేంజ్
- ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World EV Day 2026: పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నిర్వహణ ఖర్చుల కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో World EV Day 2026 సందర్భంగా రూ.1.5 లక్షల లోపు అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను తెలుసుకుందాం. ఈ జాబితాలో Ather, Ampere, Vida, TVS, Bajaj వంటి ప్రముఖ కంపెనీల మోడళ్లు ఉన్నాయి.
Ather Konark
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Ather ఇటీవల Konark ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్లో 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 161 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 4.7 kW పవర్, 16 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది.
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
Ampere Magnus G Max
Ampere నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్ Magnus G Max. ఈ స్కూటర్లో 3 kWh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చని కంపెనీ పేర్కొంటోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.03 లక్షలుగా ఉంది. ధరతో పాటు ఫీచర్లు, రేంజ్ పరంగా ఇది రోజువారీ ప్రయాణాలకు అనువైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
Vida VX2 Go
Hero Vida అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో Vida VX2 Go కూడా ఒకటి. ఈ మోడల్లో 3.4 kWh బ్యాటరీని అందించారు. దీని ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. ఈ స్కూటర్లో ప్రత్యేకంగా రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది. అంటే బ్యాటరీని స్కూటర్ నుంచి తీసి ప్రత్యేకంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Vida VX2 Go ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.03 లక్షలు.
TVS iQube
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో TVS iQube ఒకటి. ఇందులో 5.3 kWh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చని పేర్కొన్నారు. TVS iQube ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.20 లక్షలు. అయితే వేరియంట్‌ను బట్టి ధర పెరుగుతుంది. టాప్ వేరియంట్ ధర సుమారు రూ.1.75 లక్షలు వరకు ఉంటుంది. అందువల్ల రూ.1.5 లక్షల బడ్జెట్లో కొనుగోలు చేయాలనుకునే వారు iQubeలో అందుబాటులో ఉన్న సంబంధిత వేరియంట్లను పరిశీలించాల్సి ఉంటుంది.
Bajaj Chetak
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Bajaj Auto కూడా Chetak పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. Bajaj Chetakలో 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.95,000. టాప్ వేరియంట్ ధర సుమారు రూ.1.37 లక్షలు వరకు ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి Bajaj Chetak ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు