Vayve Eva Solar Car: సోలార్ పవర్‌తో నడిచే కారు వచ్చేసింది.. ధర రూ. 3 లక్షలు మాత్రమే!
- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025
- సోలార్ పవర్‌తో నడిచే కారు వచ్చేసింది
- వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే ఇవా (Eva)కారును ఆవిష్కరించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, ఎక్ట్రిక్, సీఎన్జీతో నడిచే కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సోలార్ తో నడిచే కారు కూడా వచ్చేసింది. దేశంలోనే మొట్ట మొదటి కారు ఇది. ఆటో ఎక్స్ పోలో వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది. పట్టణాల్లో షార్ట్ రైడ్ కోసం ఈ కారు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ఈ కారు ఫుల్ ఛార్జింగ్ తో 250 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.
సోలార్ పవర్ తో పని చేయడం వల్ల అదనంగా 3,000 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు చిన్న పరిమాణంలో ఉంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు, ఒక చిన్న పిల్లవాడితో సహా ముగ్గురు కూర్చోవడానికి వీలుంటుంది. ఈ సోలార్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.25 లక్షలు మాత్రమే. ఇది నోవా, స్టెల్లా, వేగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Also Read
- Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం, లాంచ్‌కు సిద్ధమైన కియా
- Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
- Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
నోవా ధర రూ.3.25 లక్షలు, స్టెల్లా రూ.3.99 లక్షలు, వేగా రూ.4.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. బ్యాటరీ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. అంటే కారు ధర రూ.6 లక్షల వరకూ పలుకుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్స్, రిమోట్ మానిటరింగ్, వెహికల్ డయాగ్నిసిస్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో ACతో పాటు Apple Car Play, Android Auto కనెక్టివిటీ సిస్టమ్ కూడా ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ తో వస్తుంది.
తాజావార్తలు
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!