Volkswagen Tera: వోక్స్ వ్యాగన్ పోలో( Volkswagen Polo ) భారత మార్కెట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఆ స్థానాన్ని భర్తీ చేసేలా మరో కారును తీసుకురాలేదు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో పోలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఫీచర్లు మాత్రమే కాదు, దాని స్టెబిలిటీ, రైడింగ్ ఫీల్ మరే కారులో కనిపించేది కాదని చెబితే అతిశయోక్తి కాదు. చాలా మంది కార్ ప్రేమికులకు ‘‘ఫోలో’’ ఒక భావోద్వేగం. యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ అంటే ఏమిటో భారత్‌కు చూపించింది. ఇప్పటికీ, పోలో రోడ్లపై ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది. పోలో ఫీచర్లు, మైలేజ్ కన్నా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు పెద్ద పీట వేసింది. ఇప్పటికీ సెకండ హ్యాండ్ మార్కెట్‌లో పోలోకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం, సంస్థ వీటి ఉత్పత్తిని నిలిపేసింది.
అయితే, ఇప్పుడు వోక్స్ వ్యాగన్ ( Volkswagen ) పోలో వారసుడిని భారత మార్కెట్‌లోకి దించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం, భారత కార్ మార్కెట్, వినియోగదారుడి అభిరుచులు మారాయి. హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా, కాంపాక్ట్ SUVలు , క్రాస్‌ఓవర్లకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ ఆ దిశగా వెళ్తోంది. త్వరలో వోక్స్‌వ్యాగన్ టెరా(Volkswagen Tera) భారత మార్కెట్‌లోకి రాబోతోంది.
Read Also: Minister Nara Lokesh: పాదయాత్ర నా జీవితాన్ని మార్చేసింది.. సమాజం నుంచి ఎంతో నేర్చుకున్నా..
వోక్స్ వ్యాగన్ టైగున్(Taigun) కన్నా దిగువన టెరా ఉండబోతోంది. స్కోడా కైలాక్‌కు సమాన స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం బ్రెజిల్ స్పెసిఫికేషన్ ప్రకారం, టెరా పొడవు 4.1 మీటర్లు. అయితే భారత మార్కెట్‌లో సబ్-4 మీటర్ టాక్స్ బెనిఫిట్స్‌ను పొందడానికి దీని పొడవు తగ్గించే అవకాశం ఉంది. 1.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ , 6-స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో రావచ్చు.
ఇక ఇంటీరియర్స్, ఫీచర్ విషయానికి వస్తే పెద్ద ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటర్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, అంబియంట్ లైటింగ్ ఉండే అవకాశం ఉంది. అయితే, టెరా పూర్తిగా పోలోకు ప్రత్యామ్నాయం కాదు కానీ, దాని వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉంది. పోలో ఇచ్చే డ్రైవింగ్ ఫీల్, బెటర్ హ్యాండ్లింగ్‌ను టెరా కొనసాగించవచ్చు.
