NTV Telugu Site icon

Alef Model A: ప్రపంచంలో మొట్టమొదటి “ఫ్లైయింగ్ కార్”కి అమెరికా గ్రీన్ సిగ్నల్..

Alef Model A

Alef Model A

Alef Model A: ప్రపంచంలో మొట్టమొదటి ఎగిరే కారు ప్రయాణానికి సిద్ధం అవుతోంది. ‘అలెఫ్ మోడల్ ఏ’ ఫ్లైయింగ్ కార్ కి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ తన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్(eVTOL)వాహనానికి సంబంధించి అన్ని చట్టపరమైన అనుమతులను పొందింది. అక్టోబరు 2022లో ఆవిష్కరించబడిన అలెఫ్ మోడల్ ఏ ఇకపై పబ్లిక్ రోడ్లపై నడపబడుతుంది. దీన్ని నిలువగా టేకాఫ్, ల్యాండింగ్ కూడా చేయవచ్చు.

Read Also: Benjamin Mendy: 10,000 మంది మహిళలతో సెక్స్ చేశా.. స్టార్ ఫుట్‌బాలర్ కామెంట్స్..

అలెఫ్ మోడల్ ఏ 322 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. ఒకరు లేదా ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించవచ్చు. ఒక ఛార్జ్ తో 177 కిమీమీటర్ల వరకు ఎగిరి ప్రయాణించవచ్చు. దీని ధర రూ.2.46 కోట్లుగా ఉంది. అలెఫ్ వెబ్ సైట్ ద్వారా USD 150 (రూ.12,308) టోకెన్ మొత్తంతో దీన్ని ప్రీఆర్డర్ చేయవచ్చు. USD 1,500 (రూ. 1.23 లక్షలు)కి ప్రాధాన్యత బుకింగ్‌లు ఆమోదించబడుతున్నాయి. ఇప్పటికే పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి ఫ్రీ ఆర్డర్లు వచ్చినట్లు అలెఫ్ పేర్కొంది. మోడల్ ఏ ఉత్పత్తి 2025లో ప్రారంభం అవుతుంది.

అలెఫ్ US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుండి ప్రత్యేక ఎయిర్‌వర్థినెస్ సర్టిఫికేషన్‌ను పొందిందని, ఇటు వంటి వాహనాలు ఎగరడానికి యూఎస్ ప్రభుత్వం నుంచి ఆమోదం పొందడం ఇదే తొలిసారిని పేర్కొంది. ప్రజలకు పర్యావరణ అనుకూలమైన మరియు వేగవంతమైన ప్రయాణాన్ని తీసుకురావడానికి ఇది సహకరిస్తుందని కంపెనీ తెలిపింది. మోడల్ ఏ కాకుండా. మోడల్ జెడ్ ను రూపొందిస్తున్నట్లు దీని డ్రైవింగ్ పరిధి 483 కిలోమీటర్లు ఉండగా.. ఫ్లైయింగ్ రేంజ్ 354 కిలోమీటర్ల ఉంటుందని దీన్ని 2035 నాటికి తీసుకురావాలని అలెఫ్ లక్ష్యంగా పెట్టుకుంది.