NTV Telugu Site icon

2025 TVS RONIN: దుమ్మురేపే ఫీచర్లతో.. స్టైలిష్ లుక్ లో టీవీఎస్ రోనిన్ 2025 విడుదల..

Tvs

Tvs

బైక్ లవర్స్ కోసం TVS కంపెనీ భారతీయ మార్కెట్లో ప్రతిసారి కొత్త, స్టైలిష్ మోడళ్లను తీసుకొస్తోంది. తాజాగా టీవీఎస్ కంపెనీ టీవీఎస్ రోనిన్ 2025 అప్ డేటెడ్ ఫీచర్లతో మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. 225 సిసి విభాగంలో ఈ బైక్ ను అప్ గ్రేడ్ చేసింది. 2025 TVS RONIN కొత్త కలర్స్, సేఫ్టీ ఫీచర్స్ అప్ డేట్ లతో వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. బైక్ డిజైన్, ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌ గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. కొత్త టీవీఎస్ రోనిన్ 2025 ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది.

Also Read:Kiss: ముద్దంటే పడని అబ్బాయి ఉంటాడా అసలు?

2025 TVS రోనిన్ బైక్‌లో సూపర ఫీచర్లు, భద్రతా ఫీచర్లు అందించారు. ఇప్పుడు మిడ్ వేరియంట్ కూడా డ్యూయల్ ఛానల్ ABS వంటి భద్రతా ఫీచర్లతో వచ్చేసింది. దీనితో పాటు, LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్, కస్టమ్ ఎగ్జాస్ట్, ఎల్సీడీ స్పీడోమీటర్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు బైక్‌లో అందించారు. TVS రోనిన్ బైక్ 225.9cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ 20.4 PS శక్తిని, 19.93 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

Also Read:Ambati Rambabu: రేపు గుంటూరు మిర్చి యార్డ్‌కు వైఎస్‌ జగన్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన అంబటి

రోనిన్ (2025 TVS రోనిన్) ను TVS ఆధునిక రెట్రో బైక్ గా పరిచయం చేసింది. కొత్త 2025 టీవీఎస్ రోనిన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ .1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). మిడ్ వేరియంట్ ధర రూ .1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కాకుండా టాప్ వేరియంట్ ధర రూ .1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ధర, ఇంజిన్ పరంగా, ఇది బజాజ్ పల్సర్ NS200, KTM డ్యూక్ 200, హోండా NX 200, హీరో Xpulse 200 4V వంటి బైక్‌లకు గట్టిపోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.