TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?

  • టీవీఎస్ iQube S 4.7kWh
  • 175KM రేంజ్
  • టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh ధర రూ.1,37,142 లక్షలు
Tvs Iqube S

Tvs Iqube S

టీవీఎస్ మోటార్స్, భారతదేశపు అత్యంత ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh ధర రూ.1,37,142 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై 175 కిలోమీటర్ల (IDC) రేంజ్‌ను అందిస్తుంది. ఇది న్యూ కలర్ ఆప్షన్స్ తో కూడా అందుబాటులో ఉంది. భారీ బ్యాటరీతో, రైడర్లు ఇప్పుడు తమ రోజువారీ ప్రయాణాలతో పాటు, సుదూర, ఆకస్మిక ప్రయాణాలను సులభతరం చేసుకోవచ్చు. పెరిగిన రేంజ్‌తో పాటు, మాగ్నిఫిసెన్స్ పర్పుల్ బేజ్, హార్లెకిన్ బ్లూ బేజ్ అనే రెండు కొత్త రంగులను కూడా జోడించారు. టైటానియం గ్రే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

మొదటిది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ (పవర్ ఆఫ్ ఛాయిస్), ఇది వినియోగదారులకు రేంజ్, కనెక్టెడ్ ఫీచర్లు, రంగుల విషయంలో పూర్తి ఎంపిక స్వేచ్ఛను ఇస్తుంది. రెండవది మనశ్శాంతి (పీస్ ఆఫ్ మైండ్), ఇది తాజా ప్రమాణాలను పాటిస్తూ, హామీతో కూడిన డెలివరీని అందించడం ద్వారా వాహన భద్రతను, కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. తదుపరిది నిర్వహణలో సరళత (సింప్లిసిటీ ఆఫ్ ఆపరేటింగ్), ఇది అత్యంత సులభంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసేలా రూపొందించారు.

ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకువస్తాయి. భారతదేశపు అత్యంత ఇష్టమైన ఫ్యామిలీ EVగా TVS iQube స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తాయి. ప్రస్తుతం, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశవ్యాప్తంగా 1,000 పైగా నగరాల్లో, 3,300 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.