NTV Telugu Site icon

Electric Vehicles: న‌గ‌రంలో బ్యాట‌రీ స్వాపింగ్ స్టేషన్లు…

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వాడ‌కం భారీగా పెరిగిపోతున్న‌ది. ప్ర‌తిరోజు కొత్త కంపెనీల వాహ‌నాలు మార్కెట్లోకి వ‌స్తున్నాయి. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు ఛార్జింగ్ ఒక్క‌టే ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఛార్జింగ్ పెట్టేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. ఒక‌వేళ ట్రావెలింగ్ స‌మ‌యంలో చార్జింగ్ అయిపోతే ఏం చేయాలి అన్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌. అన్ని న‌గ‌రాల‌తో పాటు, హైద‌రాబాద్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరిగిపోతున్న‌ది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఇబ్బందులను గుర్తించిన ప్ర‌భుత్వం బ్యాట‌రీ స్వాపింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణ స్టేట్ రెన్యూవ‌బుల్ ఎనర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ సంస్థ ఈ ఏర్పాటు చేస్తున్న‌ది. న‌గ‌రంలో క‌నీసం 6 ప్రాంతాల్లో బ్యాట‌రీ స్వాపింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. మొద‌ట టూవీల‌ర్‌, త్రీ వీల‌ర్ వాహ‌నాల‌కోసం బ్యాట‌రీ స్వాపింగ్ ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ స్వాపింగ్ బ్యాట‌రీ సిస్ట‌మ్ అందుబాటులోకి రానున్న‌ది.

Read: Live: వాలిమై ప్రీరిలీజ్ ఈవెంట్‌…