Site icon NTV Telugu

Upcoming Electric Cars: భారత్‌లో త్వరలో రాబోయే టాప్ ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్ ఇదిగో!

Upcoming Electric Cars

Upcoming Electric Cars

Upcoming Electric Cars: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు కొత్త కొత్త ఈవీలను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ కార్ల లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్న టాప్ ఈవీ కార్ల వివరాలు చూద్దామా..

కియా సైరాస్ EV:
ఈ ఏడాది చివర్లో ఈ కారు భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. దీనిలో 42 kWh లేదా 49 kWh హ్యూండాయ్ బ్యాటరీ ప్యాక్లు ఉండే అవకాశం ఉంది. అయితే పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. కియా ఫ్యాన్స్ కోసం ఇది ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ ఎంపికగా నిలవనుంది.

Viral Video: లగేజీ విషయంలో గందరగోళం.. స్పైస్‌జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి(వీడియో)

టాటా సియెరా EV:
2025 భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ మోడల్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. హారియర్.ఈవీ మాదిరిగానే దీని పవర్‌ట్రైన్ ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఇది టాటా సియెరా ICE వెర్షన్‌ను పోలి ఉంటుంది. టాటా నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ SUV మార్కెట్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది.

మహీంద్రా XEV 7e:
ఇంకా దీనిపై అధికారిక సమాచారం బయటకు రాకపోయినా, 59 kWh మరియు 79 kWh బ్యాటరీ వేరియంట్లలో వస్తుందని అంచనా. ఈ SUV ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 500 కిమీ పరిధిని అందించగలదు.

Ravindra Jadeja: సర్ జడేజా అంటే ఆమాత్రం ఉంటది.. లక్ష్మణ్, గవాస్కర్ రికార్డులను కొల్లగొట్టిన జడ్డూ భాయ్!

మారుతీ సుజుకీ e-విటారా:
మారుతీ తన తొలి ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 3న లాంచ్ చేయనుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. 49 kWh బ్యాటరీతో 346 కిమీ మైలేజ్, 61 kWh సింగిల్ మోటార్ వేరియంట్‌తో 428 కిమీ మైలేజ్ అలాగే డ్యూయల్ మోటార్ వేరియంట్‌కి 412 కిమీ పరిధి ఉంటుంది.

హ్యూండాయ్ ఐఒనిక్ 5 ఫేస్‌లిఫ్ట్:
ఇప్పటికే మార్కెట్లో ఉన్న Ioniq 5 మోడల్‌కు కొత్త రూపం అందించబోతోంది హ్యూండాయ్. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో RWD (Rear Wheel Drive), AWD (All Wheel Drive) వేరియంట్లు ఉంటాయి. 63 kWh RWD మోడల్‌కు 394 కిమీ మైలేజ్ ఉండగా, 84 kWh RWD మోడల్‌కు 511 కిమీ, 84 kWh AWD మోడల్‌కు 466 కిమీ రేంజ్ ఉంటుంది. RWD వేరియంట్ 221 hp పవర్, 350 Nm టార్క్ కలిగి ఉండగా, AWD వేరియంట్ 315 hp పవర్, 605 Nm టార్క్ అందిస్తుంది. ఈ కార్లతో భారత ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత బలపడనుంది. టెక్నాలజీ, బాటరీ సామర్థ్యం, లాంగ్ రేంజ్ ఆధారంగా ఈ మోడళ్లపై భారీ ఆశలు ఉన్నాయి.

Exit mobile version