Upcoming Electric Cars: భారత్‌లో త్వరలో రాబోయే టాప్ ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్ ఇదిగో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upcoming Electric Cars: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు కొత్త కొత్త ఈవీలను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే ఎలక్ట్రిక్ కార్ల లిస్టు చాలా పెద్దగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగదారులు ఎక్కువగా ఎదురుచూస్తున్న టాప్ ఈవీ కార్ల వివరాలు చూద్దామా..
కియా సైరాస్ EV:
ఈ ఏడాది చివర్లో ఈ కారు భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. దీనిలో 42 kWh లేదా 49 kWh హ్యూండాయ్ బ్యాటరీ ప్యాక్లు ఉండే అవకాశం ఉంది. అయితే పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు. కియా ఫ్యాన్స్ కోసం ఇది ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ ఎంపికగా నిలవనుంది.
Also Read
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
Viral Video: లగేజీ విషయంలో గందరగోళం.. స్పైస్‌జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి(వీడియో)

టాటా సియెరా EV:
2025 భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ మోడల్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. హారియర్.ఈవీ మాదిరిగానే దీని పవర్‌ట్రైన్ ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా ఇది టాటా సియెరా ICE వెర్షన్‌ను పోలి ఉంటుంది. టాటా నుంచి వస్తున్న ఈ ఫ్యామిలీ SUV మార్కెట్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది.

మహీంద్రా XEV 7e:
ఇంకా దీనిపై అధికారిక సమాచారం బయటకు రాకపోయినా, 59 kWh మరియు 79 kWh బ్యాటరీ వేరియంట్లలో వస్తుందని అంచనా. ఈ SUV ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 500 కిమీ పరిధిని అందించగలదు.
మారుతీ సుజుకీ e-విటారా:
మారుతీ తన తొలి ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 3న లాంచ్ చేయనుంది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. 49 kWh బ్యాటరీతో 346 కిమీ మైలేజ్, 61 kWh సింగిల్ మోటార్ వేరియంట్‌తో 428 కిమీ మైలేజ్ అలాగే డ్యూయల్ మోటార్ వేరియంట్‌కి 412 కిమీ పరిధి ఉంటుంది.
హ్యూండాయ్ ఐఒనిక్ 5 ఫేస్‌లిఫ్ట్:
ఇప్పటికే మార్కెట్లో ఉన్న Ioniq 5 మోడల్‌కు కొత్త రూపం అందించబోతోంది హ్యూండాయ్. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో RWD (Rear Wheel Drive), AWD (All Wheel Drive) వేరియంట్లు ఉంటాయి. 63 kWh RWD మోడల్‌కు 394 కిమీ మైలేజ్ ఉండగా, 84 kWh RWD మోడల్‌కు 511 కిమీ, 84 kWh AWD మోడల్‌కు 466 కిమీ రేంజ్ ఉంటుంది. RWD వేరియంట్ 221 hp పవర్, 350 Nm టార్క్ కలిగి ఉండగా, AWD వేరియంట్ 315 hp పవర్, 605 Nm టార్క్ అందిస్తుంది. ఈ కార్లతో భారత ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత బలపడనుంది. టెక్నాలజీ, బాటరీ సామర్థ్యం, లాంగ్ రేంజ్ ఆధారంగా ఈ మోడళ్లపై భారీ ఆశలు ఉన్నాయి.

తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!