2026 లో రాబోయే Top Cars ఇవే.. అందరూ ఎదురుచూస్తున్న ఆ SUV వచ్చేస్తోంది.!
- 2026లో రాబోయే సుపర్ SUVల ఎంట్రీ
- రెనాల్ట్ డస్టర్.. గ్రాండ్ రీ-ఎంట్రీ
- నిస్సాన్ టెక్టన్.. కొత్త అస్త్రం
- స్కోడా & ఫోక్స్‌వ్యాగన్.. ఫేస్‌లిఫ్ట్ మోడల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top SUVs Coming to India in 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా SUVల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే, ఈ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు రెనాల్ట్, నిస్సాన్, స్కోడా , ఫోక్స్‌వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సరికొత్త మోడళ్లతో భారత్‌లోకి దండయాత్రకు సిద్ధమయ్యాయి. 2026 నాటికి ఈ సెగ్మెంట్లో పెను మార్పులు రాబోతున్నాయి.
భారత్‌లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు పునాది వేసిన ‘రెనాల్ట్ డస్టర్’ మళ్ళీ కొత్త అవతారంలో రాబోతోంది. పాత మోడల్ నిలిపివేసిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న రెనాల్ట్, ఇప్పుడు ‘న్యూ జనరేషన్ డస్టర్’ను మరింత శక్తివంతంగా రూపొందించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, మార్చిలో కంపెనీ దీని ధరను అధికారికంగా ప్రకటించనుంది. ఏప్రిల్ నుండి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇది అడ్వెంచర్ ప్రియులను , ఫ్యామిలీస్ ను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో రాబోతోంది.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
Hyderabad Rains : హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం.. జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం.!
నిస్సాన్ ఇండియా తన ఉనికిని మరింత చాటుకునేందుకు ‘టెక్టన్’ (Tekton) అనే సరికొత్త మిడ్-సైజ్ SUVని రంగంలోకి దించుతోంది. 2026 మధ్య నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. నిస్సాన్ కేవలం టెక్టన్ తోనే ఆగకుండా, ఒక కొత్త 7-సీటర్ SUVని కూడా ప్లాన్ చేస్తోంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వైడ్ డిజైన్ , స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ కార్లు ఉండబోతున్నాయి.
యూరోపియన్ కార్ల దిగ్గజం స్కోడా, తన పాపులర్ మోడల్ ‘కుషాక్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసింది. మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, కొత్త ఇంటీరియర్స్‌తో రాబోతున్న ఈ కారు డెలివరీలు మార్చి చివరి నాటికి మొదలవుతాయి. ఇదే క్రమంలో ఫోక్స్‌వ్యాగన్ కూడా తన ‘టైగన్’ మోడల్‌ను అప్‌డేట్ చేస్తోంది. 2026 రెండో త్రైమాసికంలో కొత్త టైగన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ రెండు కంపెనీలు తమ ‘ఇండియా 2.0’ ప్రాజెక్టులో భాగంగా భారీ పెట్టుబడులతో ఈ మోడళ్లను భారత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశాయి.
2024తో పోలిస్తే 2025లో SUVల అమ్మకాలు 7.85 శాతం వృద్ధి చెందాయి. రాబోయే రెండేళ్లలో ఈ సెగ్మెంట్లో డజనుకు పైగా కొత్త మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. టాటా కర్వ్, మహీంద్రా థార్ రాక్స్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లు ఇప్పటికే గట్టి పోటీ ఇస్తుండగా, ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త మోడళ్లు మార్కెట్ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఉన్న కార్లు ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!