Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం

  • అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
  • టాటా టియాగో ఈవీ
  • సిట్రోయెన్ eC3
Ev

Ev

నేటి నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 3 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. ప్రతి రోజు ట్రావెల్ చేసే వారికి అదనపు భారం కానుంది. ఈ సమయంలో చాలామంది ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, సులభమైన డ్రైవింగ్, ప్రభుత్వ సబ్సిడీల వంటి ఫీచర్లు ఈవీలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. మీరు తక్కువ ధరలో ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ నాలుగు మోడళ్లు అద్భుతమైన ఆప్షన్ కావచ్చు.

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఈవీ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇది 19.2 kWh, 24 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది సుమారుగా 250 నుండి 315 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ వల్ల రద్దీగా ఉండే నగర రోడ్లపై కూడా దీనిని సులభంగా నడపవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షలు.

MG కామెట్ EV

MG కామెట్ EV ప్రత్యేకంగా పట్టణ వినియోగం కోసం రూపొందించారు. ఇందులో 17.3 kWh బ్యాటరీ ఉంది, ఇది సుమారు 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని కాంపాక్ట్ పరిమాణం వల్ల ఇరుకైన వీధుల్లో పార్కింగ్ చేయడానికి, నడపడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.62 లక్షలు. BaaS మోడల్ కూడా రూ.4.99 లక్షలు + కిలోమీటరుకు రూ.3.2 ధరతో అందుబాటులో ఉంది.

సిట్రోయెన్ eC3

ఎలక్ట్రిక్ కారులో ప్రీమియం అనుభూతిని, ఎక్కువ స్థలాన్ని కోరుకునే వారికి సిట్రోయెన్ eC3 ఒక మంచి ఎంపిక. ఇది 29.2 kWh బ్యాటరీతో పనిచేస్తుంది, ఇది 246 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. దీని క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అందువల్ల రోజువారీ ఆఫీస్ ప్రయాణానికి ఇది ఒక గొప్ప ఎంపిక. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలు.

టాటా పంచ్ ఈవీ

మీరు SUV లాంటి లుక్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నట్లయితే, టాటా పంచ్ EV ఒక మంచి ఎంపిక కావచ్చు. ఇది 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్‌లతో పనిచేస్తుంది. 375 కి.మీ నుండి 468 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.9.69 లక్షలు కాగా, BaaS మోడల్‌ను రూ.6.49 లక్షలు.