NTV Telugu Site icon

MG Hector Facelift: సరికొత్త ఫీచర్లతో వస్తున్న ఎంజీ హెక్టర్

Mg Hector

Mg Hector

The MG Hector facelift is coming with advanced features: బ్రిటిష్ ఆటో దిగ్గజం మోరిస్ గారేజెస్(ఎంజీ) 2019లో భారత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎంజీ హెక్టర్ ద్వారా తన తొలి మోడల్ ఎస్ యూ వీ కారును భారత్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఎంజీ తొలి కారే భారత్ లో సూపర్ సక్సెక్ అయింది. ఆ తరువాత ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారుతో పాటు ఎంజీ ఆస్టర్ కార్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఎంజీ త్వరలో 2022 హెక్టర్ ఫేస్ లిప్ట్ కార్ ను మార్కెట్లలోకి తీసుకురాబోతోంది. మునపటితో పోలిస్తే ఈ సారి మరిన్ని ఫీచర్లలో హెక్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ రాబోతోంది. ఈ సారి హెక్టార్ లో 14 అంగుళాల హెచ్ డీ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుపరుస్తోంది. నెక్ట్ జనరేషన్ హెక్టర్ గా వస్తున్న దీంట్లో మరిన్ని ఫీచర్లను ఎంజీ చేర్చనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇండిాయాలో కార్లలో 10.4 పరిమాణం వరకు మాత్రమే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లను అందిస్తున్నారు. అయితే కొత్తగా రాబోతున్న న్యూ హెక్టర్ లో టెస్లా మాదిరిగా భారీ టచ్ స్క్రీన్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Read Also: State Bank Of India: ఎస్‌బీఐ యూజర్లకు అలర్ట్.. రూ.10వేలకు మించి ఏటీఎంలో విత్‌డ్రా చేస్తున్నారా?

భారత్ లొ మొట్టమొదటి సారిగా ‘ఇంటర్నెట్ ఇన్ సైడ్’ కారుగా ఎంజీ హెక్టర్ కు గుర్తింపు ఉంది. భారతీయ భాషల్లో కమాండ్స్ ఇచ్చే విధంగా వాయిస్ కమాండింగ్ ఫీచర్ ఎంజీలో ఉంది. కొత్తగా రాబోతున్న ఎంజీ హెక్టార్ లో అడ్వాన్సుడ్ డ్రైవర్ అస్టిస్టెన్స్ సిస్టమ్( ఏడీఏఎస్) లెవెల్ 2 ఫీచర్లను అందిస్తోంది. ఇప్పటికే ఈ రకం ఫీచర్ ఎంజీ ఆస్టర్ లో ఉంది. కొత్త హెక్టర్ లో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ డ్రైవర్ అస్టిస్టెన్స్ సిస్టమ్స్ తో రాబోతోంది. లైన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్, ఆటో పార్క్ అసిస్ట్ వంటి అధునాతర ఫీచర్లలో ఎంజీ రాబోతోంది.

దీంతో పాటు స్టైలింగ్ లో కూడా ఎంజీ హెక్టర్ ప్రత్యేకంగా ఉండబోతోంది. కొత్త ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, రివైజ్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లు, ఫ్రంట్ బంపర్‌లో రెడ్ హైలైట్ వంటి కొన్ని మార్పులు చేయనున్నారు. ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్ లో 1.5 లీటర్ టర్బో చార్జుడ్ పెట్రల్, 2.0 లీటర్ డిజిల్ ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది. సిక్స్ స్పీడ్ మాన్యువల్ సీవీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో రానుంది. అయితే గతంలో ఎంజీ హెక్టర్ కార్ ధర రూ. 14.15 లక్షల నుంచి రూ. 20.11 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. అయితే పాత వెర్షన్ తో పోలిస్తే కొత్తగా రాబోతోన్న ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ధర రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.