Site icon NTV Telugu

Tesla: భారత్‌లో ‘‘టెస్లా’’కు అంత ఈజీ కాదు, షాక్ ఇస్తున్న అమ్మకాలు..

Model Y

Model Y

Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’(Tesla) భారత్‌లో తన సత్తా చాటలేకపోతోంది. సగటు భారతీయులు ఈ కార్‌లను కొనేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. భారత మార్కెట్లో టెస్లాకు అంత ఈజీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. 2025లో టెస్లా ఇండియాలోకి ప్రవేశించింది. తన మోడల్ Y(Model Y)ని విక్రయిస్తోంది. అయితే, వీటి అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి.

Read Also: Rahul Gandhi: ‘‘కుక్క వివాదం’’.. రేణుకా చౌదరికి మద్దతుగా రాహుల్ అనుచిత వ్యాఖ్యలు..

VAHAN పోర్టల్ డేటా ప్రకారం, సెప్టెంబర్ 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 157 యూనిట్లను మాత్రమే విక్రయించింది. నవంబర్ లో కేవలం 48 కార్లను మాత్రమే డెలివరీ చేసింది. BMW, మెర్సిడెస్ బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్ల తయారీదారులు నవంబర్ నెలలో 267, 69 ఈవీ కార్లను అమ్మాయి. ఈ సంఖ్య టెస్లా కన్నా అధికం. భారత మార్కెట్లో మోడల్ వై ధర రూ. 58.59 లక్షలు(ఎక్స్ షోరూం) ఉండటం కూడా టెస్లా అమ్మకాలు పడిపోవడానికి ఒక కారణం. మరోవైపు, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, వోల్వోలకు భారత్‌లో బలమైన కస్టమర్ బేస్ ఉంది.

సెప్టెంబర్ మధ్య నాటికి టెస్లా దాదాపుగా 600 బుకింగ్స్ పొందింది. అయితే, వీటిలో తక్కువ మాత్రమే సేల్ అయ్యాయి. లేటెస్ట్ మోడళ్లు అందుబాటులో లేకపోవడం, డెలివరీ టైమ్ ఎక్కువగా కావడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు టాటా, మహీంద్రా, బీవైడీ వంటి కంపెనీలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్లలో ఈవీ కార్లను తీసుకురావడం కూడా టెస్లా వ్యాపారం దెబ్బతినడానికి కారణంగా తెలుస్తోంది.

Exit mobile version