NTV Telugu Site icon

Tata Motors: సేఫ్టీకి మారుపేరుగా టాటా.. నెక్సాన్, పంచ్ ఈవీ కార్లకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్..

Nexon Ev

Nexon Ev

Tata Motors: భద్రతకు, బిల్డ్ క్వాలిటీకి మారుపేరుగా ఉన్న టాటా మోటార్స్ మరోసారి సత్తా చాటింది. దేశంలో అత్యంత సురక్షితమై కార్లుగా టాటా కార్లు పేరుగాంచాయి. ఇప్పటికే సంస్థకు చెందిన ఎలక్ట్రిక్(EVs), ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్స్(ICE) కార్లు అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను, సేఫ్టీ రేటింగ్స్‌ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే గ్లోబల్ NCAP రేటింగ్స్‌లో ఇది స్పష్టమైంది. తాజాగా భారత్ NCAP రేటింగ్స్‌లో కూడా టాటా కార్లకు తిరుగులేదని తేలింది. టాటా నుంచి వచ్చిన నెక్సాన్.ev, పంచ్.evలు సేఫ్టీ రేటింగ్స్‌లో సత్తా చాటాయి. ఈ రెండు కార్లు కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించాయి.

Read Also: Indian Coast Guard Recruitment: ఇండియన్​ కోస్ట్​గార్డ్​లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వనం

ప్రస్తుతం నెక్సాన్, హారియర్, సఫారీ, పంచ్ మోడళ్లు అత్యుత్తమ భద్రతను కలిగి ఉన్నాయి. ఈ నాలుగు మోడళ్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్‌ని కలిగి ఉన్నాయి. టాటా పంచ్.ev, టాటా నెక్సాన్.ev, టాటా హారియర్, టాటా సఫారీలు పెద్దవాళ్ల భద్రత కేటగిరితో పాటు పిల్లల భద్రత కేటగిరీల్లో 5-స్టార్ స్కోర్ చేశాయి. ఇదిలా ఉంటే పాయింట్ల పరంగా నెక్సాన్.ev, హారియర్, సఫారీల కన్నా పంచ్.ev అత్యుత్తమంగా నిలిచింది.

పెద్దల భద్రతలో పంచ్.ev 32కి 31.46 పాయింట్లను కలిగి ఉండగా, సఫారి మరియు హారియర్‌లు ఒక్కొక్కటి 30.08 పాయింట్లు మరియు Nexon.ev 29.86 పాయింట్లను కలిగి ఉన్నాయి. పిల్లల భద్రతలో, పంచ్.ev 49కి 45 పాయింట్లను కలిగి ఉంది, నెక్సాన్.evకి 44.95 పాయింట్లు మరియు సఫారి, హారియర్‌ ఒక్కొక్కటి 44.54 పాయింట్లు ఉన్నాయి.