Site icon NTV Telugu

ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్‌, లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ తో వచ్చేస్తున్న లెజెండ్ Tata Sierra SUV..!

Tata Sierra Suv

Tata Sierra Suv

Tata Sierra SUV: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి త్వరలో విడుదల కానున్న సియెరా (Sierra) ఎస్‌యూవీ గురించి ఆసక్తిని పెంచుతూ వరుస టీజర్‌లను విడుదల చేస్తోంది. నవంబర్ 25న లాంచ్‌కు ముందే కంపెనీ ఇప్పటికే ఈ కారు ఔటర్ లుక్, సన్‌రూఫ్, కాస్త ఇంటీరియర్ వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ వీడియోలో టాటా సియెరా డాష్‌బోర్డ్‌పై ఉన్న మూడు స్క్రీన్ లేఅవుట్ (Triple-Screen Layout)ను హైలైట్ చేసింది. ఇది ప్రస్తుతం టాటా వాహనాల్లో కనిపించని ఒక కొత్త ఫీచర్‌గా నిలవనుంది.

Bengaluru: జంట ఘాతుకం.. ఇంటి యజమానిని చంపి మంగళసూత్రంతో పరారీ

ఈ కొత్త టీజర్ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది డాష్‌బోర్డ్‌పై ఉన్న మూడు స్క్రీన్స్ డిజైన్. ఇందులో మొదటిది డ్రైవర్ ముందు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్య భాగంలో సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ముందున్న ప్రయాణీకుల కోసం ప్రత్యేక స్క్రీన్ ఇలా మూడు కనెక్ట్ చేయబడిన డిస్‌ప్లేలు ఉన్నాయి. టాటా మోటార్స్ వాహనాలలో ఈ విధమైన మూడు స్క్రీన్ల కాన్ఫిగరేషన్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మహీంద్రా XEV 9e లో మాత్రమే ఇలాంటి డిజైన్ ఉంది.

టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి.. ప్రతి ఒక్కరికి Tata Sierra కారు..!

వీడియోలో సియెరా కారు స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా చూపించారు. ఇందులో టాటా బ్రాండ్ లోగో (Illuminated Logo) ఉండగా, ఇది కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొత్త వాహనాల్లో కనిపించిన డిజైన్‌లకు సమానంగా ఉంది. ఇక టీజర్‌లో సియెరా ఎస్‌యూవీ ఎరుపు రంగులో దర్శనమిచ్చింది. గత టీజర్‌లలో ఇది పసుపు రంగులో కనిపించింది. ఇక టాటా సియెరా యొక్క ఇంజిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం ఈ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికల్లో లభించే అవకాశం ఉంది. ఇంజిన్ పరంగా 2.0 లీటర్ క్రయోటెక్ (Kryotec) డీజిల్ ఇంజిన్, అలాగే అభివృద్ధి చేసిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సియెరాలో అందుబాటులో ఉండొచ్చని అంచనా. అంతేకాకుడా ఈ వాహనంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు లెవల్-2 ADAS, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇంకా అనేక అధునాతన కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభించనున్నాయి.

Exit mobile version