Site icon NTV Telugu

Tata Sierra: వచ్చేస్తోంది టాటా సియెర్రా.. నవంబర్ 25న లాంచ్..

Tata Sierra

Tata Sierra

Tata Sierra: టాటా మోటార్స్(Tata Motors) సియెర్రా SUVని తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఈ కార్‌ని లాంచ్ చేయబోతున్నారు. సియోర్రా టీజర్‌ను టాటా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్స్‌తో పాటు ఇంటీరియర్‌‌ను పరిచయం చేసింది. టాటా మోటార్స్ గత వాహనాలతో పోలిస్తే సియెర్రా మరింత స్టైలిష్ లుక్స్‌తో వస్తోంది. ఇంటీరియర్, డాష్‌బోర్డులు కొత్తగా కనిపిస్తున్నాయి. 3-స్రీన్ లేవుట్ స్పష్టంగా కనిపిస్తోంది. సర్‌రూఫ్‌తో స్టైలిష్ లుక్స్ కలిగి ఉంది.

Read Also: Pakistan: 26/11 ముంబై దాడులపై బాంబ్ పేల్చిన పాక్ అధ్యక్షుడి సహాయకుడు..

డాష్ బోర్డులో 3-స్ర్కీన్ డిజైన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ముందు కూర్చునే పాసింజర్ కోసం మరొక ప్రత్యేక స్క్రీన్ ఉంది. తొలిసారిగా టాటా మోటార్స్ సియెర్రాలోనే 3-స్క్రీన్ డిజైన్ అందిస్తోంది. ప్రస్తుతం, మహీంద్రా XEV 9eలో ఇలా మూడు స్క్రీన్లు ఉన్నాయి.

అయితే, టాటా సియెర్రా(Tata Sierra)కు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ కారు పవర్ ట్రెయిన్ వివరాలు వెల్లడి కాలేదు. ముందుగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తోంది. దీని తర్వాత ఈవీ వెర్షన్ రిలీజ్ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. హరియర్, సఫారీలో ఉన్న 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో పాటు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్రాన్స్‌మిషన్‌లో మాన్యువల్, ఆటోమెటిక్ ఉండే అవకాశం ఉంది.

Exit mobile version