Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
- టాటా సియెర్రా EV తొలి టీజర్‌ను విడుదల
- టాటా EV లైనప్‌లో ఏడవ మోడల్
- టీజర్లో కనిపించిన డిజైన్ హైలైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైన టాటా మోటార్స్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV తొలి టీజర్‌ను విడుదల చేసింది. ఐకానిక్ సియెర్రా పేరును మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఎలక్ట్రిక్ SUV, ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVని జూన్ 30, 2026న అధికారికంగా పరిచయం చేయనున్నారు.
టాటా EV లైనప్‌లో ఏడవ మోడల్
టాటా మోటార్స్ ఇప్పటికే నెక్సాన్ EV, పంచ్ EV, కర్వ్ EV, హారియర్ EV వంటి పలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో అందిస్తోంది. ఈ జాబితాలో సియెర్రా EV ఏడవ ఎలక్ట్రిక్ మోడల్‌గా చేరనుంది. ధర, ఫీచర్ల పరంగా ఇది హారియర్ EV కంటే దిగువన ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో సఫారీ EVను కంపెనీ ఫ్లాగ్షిప్ 7-సీటర్ ఎలక్ట్రిక్ SUVగా తీసుకురానున్నట్లు సమాచారం.
Also Read
- Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
టీజర్లో కనిపించిన డిజైన్ హైలైట్స్
టాటా విడుదల చేసిన టీజర్లో సియెర్రా EV ముందు భాగం కనిపించింది. పూర్తి వివరాలు వెల్లడించకపోయినా కొన్ని ముఖ్యమైన డిజైన్ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డిజైన్ ఫీచర్లు:
క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్
క్లామ్‌షెల్ హుడ్
ఫుల్-విడ్త్ LED DRL లైట్ బార్
స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్
వర్టికల్ LED ఫాగ్ ల్యాంప్స్
బాడీ కలర్ ఫ్రంట్ ఫాసియా
ప్రత్యేక EV బ్యాడ్జింగ్ ఈ డిజైన్ SUVకి ఆధునిక, ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.
ప్రీమియం క్యాబిన్
సియెర్రా EV ఇంటీరియర్ కూడా అత్యాధునికంగా ఉండే అవకాశం ఉంది.
అంచనా ఫీచర్లు:
ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ సెటప్
JBL ప్రీమియం ఆడియో సిస్టమ్
Dolby Atmos సపోర్ట్
సాఫ్ట్-టచ్ మెటీరియల్స్
డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
పవర్డ్ టెయిల్‌గేట్
ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
ఆటోమేటిక్ హెడ్‌లైట్స్
రెయిన్ సెన్సింగ్ వైపర్స్
ADAS, AR-HUD వంటి ఆధునిక టెక్నాలజీలు
సురక్షిత ప్రయాణం కోసం టాటా సియెర్రా EVలో ADAS (Advanced Driver Assistance Systems), AR ఆధారిత Head-Up Display (HUD), 360 డిగ్రీ కెమెరా, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, విశాలమైన బూట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
75kWh బ్యాటరీ.. 500Nm టార్క్?
నివేదికల ప్రకారం, సియెర్రా EV హారియర్ EV ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంటోంది.
పవర్‌ట్రెయిన్ అంచనాలు:
75kWh వరకు బ్యాటరీ ప్యాక్
డ్యూయల్ మోటార్ సెటప్
Quad Wheel Drive (QWD) సిస్టమ్
500Nm వరకు గరిష్ట టార్క్ ఈ సెటప్ SUVకు శక్తివంతమైన పనితీరును అందించనుందని భావిస్తున్నారు.
రేంజ్‌పై ఇంకా సస్పెన్స్
సియెర్రా EV అధికారిక డ్రైవింగ్ రేంజ్, పవర్ అవుట్‌పుట్, ఛార్జింగ్ వివరాలను టాటా మోటార్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సమాచారం లాంచ్ ఈవెంట్ సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
- Tags
- Tata
- Tata Sierra EV
తాజావార్తలు
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!