Site icon NTV Telugu

Tata Safari Classic 2025: తక్కువ ధరకే టాటా సఫారీ-7 సీటర్.. ప్రత్యేకత ఏంటంటే?

Tata

Tata

మీరు మంచి 7 సీట్ల కారు కొనాలని చూస్తున్నారా? మీకోసమే ఈ వార్త. టాటా మోటార్స్ తన టాటా సఫారీ క్లాసిక్‌లో అద్భుతమైన అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌ను అందిస్తుంది. ఈ కారు ధర కూడా మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపోతుంది! ఈ కారును ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఎందుకు బెస్ట్? దీని ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Maharashtra: మహాయుతిలో విభేదాలు.. శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ సమావేశం

టాటా సఫారీ క్లాసిక్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పవర్ స్టీరింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS, ముందు భాగంలో పవర్ విండోస్, ఎయిర్ కండిషనర్, ఎయిర్‌బ్యాగ్స్. ఫాగ్ లైట్లు అందించారు. అంతే కాకుండా సఫారీ క్లాసిక్ మోడల్‌లో క్లాసీ అల్లాయ్ వీల్స్, మల్టీ ఫంక్షన్ స్ట్రింగ్ వీల్, టాకోమీటర్, డిజిటల్ క్లాక్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, రియర్ విండో వైపర్, సెంట్రల్ లాకింగ్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి.

READ MORE: YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

ఇది 2179cc శక్తివంతమైన ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 153.86bhp శక్తిని, 400Nm గరిష్ట న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ కారులో ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉన్నాయి. 63-లీటర్ల ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంది. ఈ కారు లీటరుకు 14.1 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వనున్నట్లు సమాచారం. టాటా సఫారీ క్లాసిక్ ను చాలా తక్కువ ధరకు అందించే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును 6 వేరియంట్లలో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 16.62 లక్షల వరకు ఉండవచ్చు. కానీ.. ఇప్పటి వరకు కారు లాంచ్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

Exit mobile version