NTV Telugu Site icon

Tata Punch EV: ఇక టాటా పంచ్ వంతు.. ఈవీగా రాబోతున్న పంచ్…

Tata Punch

Tata Punch

Tata Punch EV to be launched in India: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల అమ్మకాలు పెరుగుతున్నాయి. క్రమంగా ఎలక్ట్రిక్ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈవీ కార్ల విభాగంతో దేశంలోనే టాప్ లో ఉంది దేశీయ కార్ మేకర్ దిగ్గజం టాటా. టాటా నెక్సాన్ ఈవీ తర్వాతే.. ఇతర కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటానే అగ్రస్థానంలో ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈవీ సెగ్మెంట్ లో 87 శాతం వాటాను కలిగి ఉంది టాటా. ఈ ఏడాది కర్వ్ ఈవీ, అవిన్యా ఈవీ వంటి కాన్సెప్ట్ వెర్షన్లను ప్రదర్శించింది.

Read Also: China-Taiwan Conflict: తైవాన్ సరిహద్దుల్లో చైనా యుద్ధవిన్యాసాలు.. ఆక్రమణే లక్ష్యమా..?

ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ కార్లు మార్కెట్లో ఉన్నాయి. ఇటీవల హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో టియాగో ఈవీని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. టియాగో ఈవీ కార్ల బుకింగ్స్ హాట్ కేకుల్లా అయిపోయాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి బుక్ చేసుకున్నవారిక టాటా టియాగో ఈవీ కార్లను అందిచనుంది. ఇదిలా ఉంటే కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్ల విభాగంలో మరో ఈవీని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీని త్వరలోనే తీసుకువస్తున్నట్లు సమాచారం.

2026 వరకు దాదాపుగా 10 ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండేలా టాటా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం టాటాలో నెక్సాన్, పంచ్ కార్లు అద్భుతమైన సేలింగ్స్ ను నమోదు చేస్తున్నాయి. అమ్మకాల్లో టాటాను అగ్రస్థానంలో ఉన్నాయంటే ఈ రెండు మోడళ్లే కారణం. ఎస్ యూ వీ కార్ల విభాగంలో నెక్సాన్ ఇప్పటికీ టాప్ స్థానంలో కొనసాగుతోంది. జనవరి-నవంబర్ కాలంలో టాటా 3,26,354 యూనిట్ల ఎస్ యూ వీ కార్లను విక్రయించింది. టాటా పంచ్ 11 నెల్లల్లో లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకుంది. సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ అయిన పంచ్ 1.21 లీటర్ రెవోట్రాన్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. 113 న్యూటన్ మీటర్ టార్క్ తో 86 పీఎస్ పవర్ ని జనరేట్ చేస్తుంది. ప్రస్తుతం ఐసీఈ వేరియంట్ ధర రూ.6 లక్షల నుంచి 8.94 లక్షల మధ్య ఉంది. అయితే కొత్తగా రాబోతున్న పంచ్ ఈవీ ధర నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీల మధ్య ఉండే అవకాశం ఉంది.

Show comments