Tata Motors 2026 Cars: 2026లో భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కీలకమైన కొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది టాటా మోటార్స్. తాజాగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్‌లో సియెర్రా SUVను విడుదల చేసిన టాటా, 2026 తొలి త్రైమాసికంలో సియెర్రా ఈవీ (Sierra EV)ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది. అలాగే, కొత్త ఏడాదిలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్, నెక్సాన్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌లు కూడా విడుదల కానున్నాయి. 2026లో రానున్న టాటా కార్ల వివరాలు ఇవే..
Read Also: Hyderabad Cyber Fraud: మామూలు కి’లేడి’ కాదయ్యో.. ఇల్లు గుల్ల చేసిందిగా!
2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా పంచ్‌కు 2026 ప్రారంభంలో భారీ ఫేస్‌లిఫ్ట్ రానుంది. ఈ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి రూ.9.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. డిజైన్ పరంగా పంచ్ EVకి దగ్గరగా కొత్త లుక్ తో రాబోతుంది. కనెక్టెడ్ లైట్ బార్, ఆధునిక బంపర్ డిజైన్, కొత్త అలాయ్ వీల్స్, రిఫ్రెష్ చేసిన రియర్ లుక్ ఇందులో కనిపిస్తాయి. ఇంటీరియర్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, EVలో ఉన్న రెండు స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లను ఇందులో జోడించే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ కూడా ALFA ప్లాట్‌ఫామ్‌పైనే కొనసాగనుంది. ఇంజిన్ పరంగా 1.2 లీటర్ పెట్రోల్, CNG ఆప్షన్లను యథాతథంగా కొనసాగించనుంది.
Read Also: స్టాండ్‌బై ప్లేయర్స్ లేకుండానే T20 World Cupకు టీమిండియా.. ఎందుకంటే..?
2026 టాటా సియెర్రా ఈవీ
టాటా సియెర్రా EVను 2026 తొలి త్రైమాసికంలో రిలీజ్ చేయనుంది. దీని ప్రారంభ ధర రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఈ ఎలక్ట్రిక్ SUV రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లతో మార్కెట్లోకి రానుంది. Argos ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ మోడల్‌లో స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ ఉండి, డ్యుయల్ మోటర్ సెటప్‌కు సపోర్ట్ చేస్తుంది. సానంద్ ప్లాంట్‌లో ICE మోడల్‌తో పాటు దీని ఉత్పత్తి కొనసాగుతుంది. డిజైన్ ఎక్కువగా ICE సియెర్రాలానే ఉన్నా, బ్లాంక్ ఆఫ్ గ్రిల్‌తో ప్రత్యేకమైన ఫ్రంట్ ఫేసియా ఉంటుంది. బ్యాటరీ పరంగా Curvv EVలోని 55kWh ప్యాక్, Harrier EVలోని 65kWh యూనిట్‌లను ఉపయోగించే ఛాన్స్ ఉంది.
Read Also: China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్ బాంబ్.. డేంజర్ జోన్‌లో ఇండియా!
2026 నెక్స్ట్ జనరేషన్ టాటా నెక్సాన్
టాటా మోటార్స్ నెక్స్ట్ జనరేషన్ నెక్సాన్‌పై ఇప్పటికే వర్క్ చేస్తుంది. ‘గరుడ్’ అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధిలో ఉన్న ఈ మోడల్ 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి రానుంది. దీని ప్రారంభ ధర రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందే ఈ నెక్సాన్‌తో, ప్రస్తుత తరం నెక్సాన్‌కు పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకబోతుంది. డిజైన్, ఇంటీరియర్‌లో భారీ మార్పులు ఉండి, టాటా తాజా డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రతిబింబించనుంది. ఇంజిన్ పరంగా 1.2 లీటర్ పెట్రోల్, CNG కొనసాగవచ్చని అంచనా.. BS7 నిబంధనల కారణంగా డీజిల్ భవితవ్యం ఇంకా క్లారిటీ రాలేదు. నెలకు సుమారు 12,000 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. నెక్సాన్ EVకు కూడా భవిష్యత్తులో అప్‌డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా, మొత్తంగా చూస్తే, 2026లో టాటా మోటార్స్ SUV, EV సెగ్మెంట్లలో మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వబోతుంది.
