NTV Telugu Site icon

Tata Motors Price Hike 2023: మళ్లీ షాక్​ ఇచ్చిన టాటా మోటార్స్​.. పెరగనున్న కార్ల ధరలు!

Tata Motors Price Hike

Tata Motors Price Hike

Tata Motors Price Hike 2023: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ‘టాటా మోటార్స్’ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్.. తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్యుత్‌ వాహనాలు సహా అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పెంపు జులై 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఇన్‌పుట్‌ కాస్ట్‌ పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని టాటా మోటార్స్‌ తెలిపింది.

టాటా మోటార్స్‌కు చెందిన హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్, ఎస్‌యూవీ, ఈవీ వాహనాల అన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. టియాగో, టిగోర్‌, ఆల్ట్రోజ్‌, సఫారి, నెక్సాన్‌, పంచ్, హ్యారియర్‌ పేరిట వివిధ మోడళ్లను టాటా మోటార్స్‌ ప్రస్తుతం విక్రయిస్తోంది. నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ పేరిట విద్యుత్‌ కార్లను కూడా టాటా అమ్ముతోంది. ఇప్పుడు ఈ కార్ల ధరలు పెరగనున్నాయి. అయితే జులై 16 వరకు చేసిన బుకింగ్‌లకు, జులై 31లోపు జరిగే డెలివరీలకు ధరల పెంపు వర్తించదు.

టాటా మోటార్స్ కంపెనీ 2023 మే 1న కూడా కార్ల ధరలను 0.6% (వెయిటెడ్ యావరేజ్ పెరుగుదల) పెంచింది. అంతకుముందు జనవరిలో కూడా టాటా కార్ల ధరలు పెరిగాయి. గడిచిన ఆరు నెలలో టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి. ఇక 2022-23 క్యూ1లో టాటా మోటార్స్ 2,31,248 యూనిట్లతో పోలిస్తే.. 2023-24 క్యూ1లో 2,26,245 వాహన విక్రయాలను నమోదు చేసింది. జూన్ 2023 నెల దేశీయ అమ్మకాల పరంగా 80,383 యూనిట్లను విక్రయించింది.

Also Read: Khushi Kapoor Bikini Pics: బికినీలో ఖుషీ కపూర్.. జాన్వీని మించేలా ఉందిగా!

Also Read: Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!