Tata Motors Price Hike 2023: మళ్లీ షాక్ ఇచ్చిన టాటా మోటార్స్.. పెరగనున్న కార్ల ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors Price Hike 2023: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్.. తాజాగా మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. విద్యుత్ వాహనాలు సహా అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పెంపు జులై 17 నుంచి అమల్లోకి వస్తుంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని టాటా మోటార్స్ తెలిపింది.
టాటా మోటార్స్‌కు చెందిన హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీ, ఈవీ వాహనాల అన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, సఫారి, నెక్సాన్, పంచ్, హ్యారియర్ పేరిట వివిధ మోడళ్లను టాటా మోటార్స్ ప్రస్తుతం విక్రయిస్తోంది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ పేరిట విద్యుత్ కార్లను కూడా టాటా అమ్ముతోంది. ఇప్పుడు ఈ కార్ల ధరలు పెరగనున్నాయి. అయితే జులై 16 వరకు చేసిన బుకింగ్‌లకు, జులై 31లోపు జరిగే డెలివరీలకు ధరల పెంపు వర్తించదు.
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
టాటా మోటార్స్ కంపెనీ 2023 మే 1న కూడా కార్ల ధరలను 0.6% (వెయిటెడ్ యావరేజ్ పెరుగుదల) పెంచింది. అంతకుముందు జనవరిలో కూడా టాటా కార్ల ధరలు పెరిగాయి. గడిచిన ఆరు నెలలో టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి. ఇక 2022-23 క్యూ1లో టాటా మోటార్స్ 2,31,248 యూనిట్లతో పోలిస్తే.. 2023-24 క్యూ1లో 2,26,245 వాహన విక్రయాలను నమోదు చేసింది. జూన్ 2023 నెల దేశీయ అమ్మకాల పరంగా 80,383 యూనిట్లను విక్రయించింది.
Also Read: Khushi Kapoor Bikini Pics: బికినీలో ఖుషీ కపూర్.. జాన్వీని మించేలా ఉందిగా!
Also Read: Green Apple Benefits: గ్రీన్ ఆపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!