Site icon NTV Telugu

Altroz Facelift: కొత్త టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ.. మైలేజీలో రారాజు..!

Altroz Facelift

Altroz Facelift

టాటా మోటార్స్ ఇటీవలే భారతదేశంలో తన ప్రసిద్ధ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కి చెందిన కొత్త 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. కొత్త ఆల్ట్రోజ్ శక్తివంతంగా కనిపించడమే కాకుండా.. ఇందులో మూడు ఇంధన ఎంపికలు(పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ) వేరియంట్లలో లభ్యమవుతోంది. కాగా.. టాటా మోటార్స్ తాజాగా మైలేజ్ గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. మైలేజీ పరంగా కొత్త ఆల్ట్రోజ్ బెస్ట్ అంటున్నారు. ఏయే వేరియంట్ ఎంత మైలేజీ ఇస్తుందో వివరంగా తెలుసుకుందాం..

READ MORE: Kannappa: హార్డ్ డిస్క్ మిస్సింగ్.. ఇది చేసిందెవరో మీ అందరికీ తెలుసు

వాస్తవానికి… సీఎన్‌జీ ఆప్షన్ 1.2-లీటర్ మూడు-సిలిండర్ ఇంజిన్. ఇది ప్రత్యేకంగా ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 103 ఎన్ఎమ్ టార్క్‌తో 72 హెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది. ఈ యూనిట్ 26.90 km/kg మైలేజీని అందిస్తుంది. డీజిల్ పవర్‌ట్రెయిన్‌లో 90 హెచ్‌పి పవర్, 200 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ పవర్‌తో ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉపయోగించి చక్రాలకు బదిలీ చేస్తారు. ఈ సెటప్ 23.60 kmpl మైలేజీని అందిస్తుంది. కాగా.. తక్కువ దూరాలు ప్రయాణించే వారికి పెట్రోల్ వేరియంట్ ఉపయోగకరంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్‌లు, అధిక మైలేజీని ఇష్టపడే వారికి డీజిల్ సరైనది. కానీ, బడ్జెట్‌లో ఉత్తమ మైలేజీని కోరుకుంటే.. సీఎన్‌జీ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక జనసేన వాళ్ళు ఉన్నా వదలొద్దు!

Exit mobile version