Tata Harrier & Safari Petrol Launched in India:టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలు హారియర్, సఫారీల పెట్రోల్ వెర్షన్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో టాటా ప్రీమియం ఎస్‌యూవీ విభాగం మరింత విస్తరించింది. కొత్తగా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ హైపీరియన్ టర్బో–జీడీఐ ఇంజిన్ కలిగిన హారియర్ పెట్రోల్ ధర రూ.12.89 లక్షలు కాగా, సఫారీ పెట్రోల్ ధర రూ.13.29 లక్షలుగా ఎక్స్‌షోరూమ్ ధరలు నిర్ణయించారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 170 బీహెచ్‌పీ శక్తి, 280 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఎస్‌యూవీలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత పవర్‌ట్రెయిన్ ఆప్టిమైజేషన్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్‌లో అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాలుగా ఈ ఎస్‌యూవీలు నిలుస్తాయని టాటా మోటార్స్ వెల్లడించింది.
READ MORE: TheRajaSaab : ఇది రెబెల్ స్టార్ రేంజ్.. భారత ఏకైక నటుడుగా రికార్డ్
ఇంధన సామర్థ్యం విషయంలో హారియర్ ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పెట్రోల్ మాన్యువల్ ఎస్‌యూవీల్లో అత్యధిక మైలేజ్ సాధించిన వాహనంగా రికార్డు నమోదు చేసింది. భద్రత విషయంలోనూ హారియర్, సఫారీ పెట్రోల్ మోడళ్లకు అత్యున్నత గుర్తింపు లభించింది. అన్ని పెట్రోల్ వేరియంట్లు భారత్ ఎన్‌క్యాప్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి. దీంతో ఈ రెండు మోడళ్ల పూర్తి శ్రేణి ఫైవ్ స్టార్ సేఫ్టీ సర్టిఫికేషన్ సాధించినట్టైంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీల్లో 14.52 ఇంచుల సామ్‌సంగ్ నియో క్యూ–ఎల్‌ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో 10 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్ అందుబాటులో ఉంది. అలాగే డ్యూయల్ డ్యాష్ కెమ్ డీవీఆర్‌తో కూడిన విజన్–ఎక్స్ ఈ–ఐఆర్‌వీఎం, డ్యూయల్ కెమెరా వాషర్, మెమరీ ఫంక్షన్‌తో ఆటో రివర్స్ డిప్ ఓఆర్‌వీఎంలు వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఇంటెల్లి–స్టార్ట్ టెక్నాలజీ అమర్చారు. వాహనం స్టార్ట్ చేసిన వెంటనే క్లైమేట్ కంట్రోల్ సింక్ అవుతుంది. అంతేకాదు.. కంపెనీ కొత్తగా రెడ్ డార్క్ ఎడిషన్లు కూడా పరిచయం చేసింది. హారియర్‌లో కొత్త ఆయిస్టర్ వైట్, టైటాన్ బ్రౌన్ ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు ఉండగా, సఫారీలో కార్నెలియన్ రెడ్, బ్లాక్ కలయికతో ప్రీమియం కేబిన్ డిజైన్ ఇచ్చారు. అదనంగా 19 ఇంచుల అలాయ్ వీల్స్, వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, బాస్ మోడ్ సీటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఈ ఎస్‌యూవీలను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
