NTV Telugu Site icon

Bharat Mobility Expo: స్టైలిష్ లుక్స్… స్మార్ట్ ఫీచర్లు! కొత్త అవతారంలో టాటా నెక్సాన్..

Nexon

Nexon

టాటా మోటార్స్ ఇటీవల పలు కార్లను కొత్త ఫీచర్లు, వేరియంట్‌లతో అప్‌డేట్ చేసింది. టియాగో, టిగోర్ తర్వాత కంపెనీ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నెక్సాన్ ఇంజన్ మెకానిజంలో ఎటువంటి మార్పు లేదు. కానీ దీనికి కొన్ని కొత్త ఫీచర్లు, వేరియంట్‌లు జోడించారు. కొత్త టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

2025 టాటా నెక్సాన్‌లో మారిన ఫీచర్స్..

2025 టాటా నెక్సాన్ ఇప్పుడు కొత్త కార్బన్ బ్లాక్, క్రియేటివ్ బ్లూ, రాయల్ బ్లూ, గ్రాస్‌ల్యాండ్ బీజ్ పెయింట్ స్కీమ్‌లతో వస్తుంది. ఇది డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్ కలర్లలో కూడా అందుబాటులోకి రానుంది.కంపెనీ కలర్ ఆప్షన్ జాబితా నుంచి ఫ్లేమ్ రెడ్, ఫియర్‌లెస్ పర్పుల్ రంగులను తొలగించింది. ముఖ్యంగా ఇందులో ఇందులో ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ట్రిమ్ వంటి వేరియట్‌లను నిలిపేసింది. ఇవి కాకుండా రెండు కొత్త వేరియంట్‌లైన.. ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఎస్‌లను జోడించింది.

కొత్త వేరియంట్‌లలో ఫీచర్సు..
ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్-వ్యూ కెమెరా, ఆటో ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMలు), హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. ఇది కాకుండా, ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్‌లో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, సన్‌రూఫ్ సౌకర్యం కూడా ఉంది. కొత్త క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, TPMS, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, వైర్‌లెస్ ఛార్జర్ సౌకర్యం ఉంది.

ఎయిర్ ప్యూరిఫైయర్…
కొత్త వేరింయట్‌లో 360-డిగ్రీ కెమెరాను అమర్చారు. ఇందులో డైనమిక్ టర్న్ సిగ్నల్స్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ను తీసేశారు. అయితే, క్రియేటివ్+ S వేరియంట్‌లో సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు అందించారు. కొత్త టాప్-స్పెక్ ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఇది 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ డేటైమ్-రన్నింగ్ లైట్లు (DRLలు), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు అందించారు.

శక్తి – పనితీరు: ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ముందు నుంచే ఉంది. సీఎన్‌జీ వెర్షన్ కూడా అందించారు. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ అమర్చారు. టర్బో పెట్రోల్ ఇంజన్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT), 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT0), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT), డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) వంటి ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి.