Site icon NTV Telugu

2026లో Tata Avinya EV ఎంట్రీ ఫిక్స్.. ఫ్లాట్ ఫ్లోర్, ఫ్యూచర్ టెక్, ప్రీమియం లుక్..

Tata

Tata

Tata Avinya EV: టాటా మోటార్స్ 2026లో భారత మార్కెట్లోకి Tata Avinya ఎలక్ట్రిక్ కారును తీసుకు రాబోతోంది. ఇది టాటా దీర్ఘకాలిక ఎలక్ట్రిక్ వాహనాల్లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన అవిన్యా, టాటా ప్రస్తుత EVల కంటే ప్రీమియం స్థాయిలో మార్కెట్‌లో నిలవనుంది. టాటా Sierra EV, Punch EV ఫేస్‌లిఫ్ట్ తర్వాత Punch EV facelift లాంచ్‌లను అనుసరించి.. అవిన్యా భారత EV పోర్ట్‌ఫోలియోలో టాప్-ప్రీమియం మోడల్‌గా ప్రవేశించబోతుంది. ప్రత్యేకంగా EVల కోసం రూపొందించిన Born-Electric ప్లాట్‌ఫామ్ పై అవిన్యా నిర్మితమైతుది. స్పేస్, ఎనర్జీ ఎఫిషియెన్సీ, అడ్వాన్స్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యాలుగా టాటా దీనిని అభివృద్ధి చేస్తోంది.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ!

Born-Electric ప్లాట్‌ఫామ్‌పై Avinya
* టాటా అవిన్యా, టాటా మోటార్స్ రూపొందించిన డెడికేటెడ్ EV ఆర్కిటెక్చర్ (Born-Electric Platform) ఆధారంగా వస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తులో వివిధ బాడీ స్టైల్స్, బ్యాటరీ వేరియంట్స్‌కు మద్దతు ఇవ్వనుంది. ఫ్లాట్ ఫ్లోర్ డిజైన్, తక్కువ ఓవర్‌హ్యాంగ్స్, పెద్ద క్యాబిన్ స్పేస్, ఎనర్జీ సేవింగ్ టెక్ ఈ వేరియంట్ యొక్క ప్రధాన బలాలు. అవిన్యా బ్యాటరీ సామర్థ్య వివరాలను టాటా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఈ మోడల్ గ్లోబల్ EV బెంచ్‌మార్క్స్‌కు అనుగుణంగా అధిక రియల్-వరల్డ్ రేంజ్ ఇవ్వగలదని అంచనా.

Read Also: Security Guard Saves Child: వామ్మో.. లిఫ్ట్ మధ్య ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లబోయిన చిన్నారి.. కాపాడిన సెక్యూరిటీ గార్డ్..

డిజైన్‌లో ప్రత్యేకత.. ఏరోడైనమిక్స్‌కు ప్రాధాన్యం
కాన్సెప్ట్‌లో కనిపించిన మినిమల్, క్లీన్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను ప్రొడక్షన్ వెర్షన్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది.
* సన్నని LED లైటింగ్ సిస్టమ్
* క్లోజ్డ్ ఫ్రంట్ ఫేషియా
* కూపే-లుక్ రూఫ్‌లైన్
* పొడవుగా, వెడల్పుగా కనిపించే టాల్ స్టాన్స్.. ఇది Nexon EV, Sierra EV SUV డిజైన్‌లకు భిన్నంగా, ప్రీమియం EV సెగ్మెంట్‌కు కొత్త లుక్‌ను తీసుకురానుంది.

ఇంటీరియర్‌లో ప్రధాన హైలైట్స్:
* మినిమలిస్టిక్ డ్యాష్‌బోర్డ్
* పెద్ద డిజిటల్ ఇంటర్‌ఫేస్
* Connected Car ఫీచర్లు
* ADAS (డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)
* ఫిజికల్ బటన్‌లు తక్కువ, ఫంక్షన్లు ఎక్కువగా టచ్‌స్క్రీన్‌లోనే ఇంటిగ్రేషన్.. ఈ ఫీచర్లతో, అవిన్యా ఫ్యామిలీ-కంఫర్ట్ + ప్రీమియం EV అనుభూతిని అందివ్వనుంది.

లాంచ్ టైమ్‌లైన్ & మార్కెట్ పొజిషనింగ్
* టాటా మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం, 2026 చివర్లో Tata Avinya భారత్‌లో లాంచ్ కానుంది. ఇది Nexon EV, Sierra EV కంటే అధిక ప్రీమియం పొజిషనింగ్‌లో ఉండనుంది. ధర వివరాలను లాంచ్‌కు ముందు ప్రకటించనున్నారు. కాగా, టాటా 2030 నాటికి పలు కొత్త EV మోడల్స్‌ను తీసుకురావాలని యోచిస్తుంది. ఈ తరుణంలో అవిన్యా ప్రీమియం EV విస్తరణకు మొదటి అడుగుగా నిలవనుంది.

 

Exit mobile version