ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే వారు ఆందోళన చెందుతుంటారు. గత వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో, బ్యాటరీలు వేడెక్కడం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. వేసవి కాలంలో విద్యుత్ వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎలక్ట్రిక్ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
READ MORE: Peddi : ‘పెద్ది’లో క్రికెట్ ను మించి వేరే ఉంది.. బుచ్చిబాబు కామెంట్స్
మొదటగా ఎలక్ట్రిక్ వాహనాన్ని వేడికి గురికాకుండా చూడాలి. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్కువసేపు ఎండలో ఉంచొద్దు. ఎండలో వాహనాన్ని పార్క్ చేయొద్దు. షెడ్స్ కింద, నీడ ప్రాంతంలో మీ వాహనాన్ని పార్క్ చేయాలి. బ్యాటరీలకు ఏదైనా నష్టం జరగకుండా నిరోధించడానికి తప్పనిసరిగా బ్యాటరీకి అనుకూలంగా ఉండే అధీకృత లేదా ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించాలి. బ్యాటరీని తరచుగా ఛార్జ్ చేయొద్దు. బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ముందు బ్యాటరీని కూల్ అయ్యేంత వరకు ఉంచాలి. మీ వాహనం బ్యాటరీలో ఏదైనా లీక్ లేదా డ్యామేజీని గమనించినట్లయితే వెంటనే పరికరాన్ని వేరు చేసి డీలర్‌కు సమాచారం అందించారు.
READ MORE: Heavy Rain Forecast: దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
వాహనం ఎక్కువసేపు పార్క్ చేసినప్పుడు పూర్తిగా ఛార్జ్ చేయబడిన లేదా పూర్తిగా ఛార్జ్ పడిపోయిన బ్యాటరీ రెండూ మీ వాహన సామర్థ్యాన్ని క్షీణింపజేస్తాయి. కావున, 20 శాతం నుంచి 80 శాతం మధ్యలో ఛార్జింగ్ నిర్వహించడం ఉత్తమం. వేసవిలో ఇంజిన్, టైర్లు త్వరగా వేడెక్కుతాయి. కొన్ని సందర్భాల్లో టైర్లు పేలిపోయి, ప్రాణ నష్టం వాటిల్లవచ్చని ఎలక్ట్రిక్, ఐసీఈ బేస్డ్ వెహికల్స్ సామర్థ్యం బాగా ఉండాలంటే కచ్చితంగా వాటి టైర్ ప్రెజర్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమాదాల బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
