Skoda Kylaq Sportline: భారత్‌లో కొత్త స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
- భారత్‌లో కొత్త Skoda Kylaq Sportline విడుదల
- రూ. 11.32 లక్షల ధర
- 6 ఎయిర్‌బ్యాగ్స్, 5-స్టార్ సేఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skoda Kylaq Sportline: స్కోడా ఆటో ఇండియా కాంపాక్ట్ SUV కైలాక్ లైనప్‌ను మరింత విస్తరించింది. తాజాగా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సిగ్నేచర్+ ప్రెస్టీజ్ వేరియంట్ల మధ్యలో ఉండేలా ఈ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. కైలాక్ స్పోర్ట్‌లైన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.11.32 లక్షలు, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రూ.12.32 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) నుంచి లభిస్తుంది.
కైలాక్‌లో ఇప్పుడు 7 వేరియంట్లు
కొత్త స్పోర్ట్‌లైన్ రాకతో స్కోడా కైలాక్ లైనప్‌లో మొత్తం ఏడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి:
Also Read
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
- Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
క్లాసిక్
క్లాసిక్+
సిగ్నేచర్
సిగ్నేచర్+
స్పోర్ట్‌లైన్
ప్రెస్టీజ్
ప్రెస్టీజ్+
అన్ని వేరియంట్లలోనూ 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగించారు. గేర్‌బాక్స్ ఎంపికగా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్‌లైన్ ధర సిగ్నేచర్+ కంటే సుమారు రూ.55,000 ఎక్కువగా ఉండగా, ప్రెస్టీజ్ వేరియంట్ కంటే రూ.43,000 తక్కువగా ఉంది. దీంతో రూ.11-12 లక్షల ధర పరిధిలో కైలాక్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మరో ఆప్షన్‌గా నిలుస్తుంది.
స్పోర్టీ లుక్‌తో కైలాక్ స్పోర్ట్‌లైన్
స్పోర్ట్‌లైన్ వేరియంట్లో ప్రధానంగా ఎక్స్టీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. దీనికి మరింత స్పోర్టీ లుక్ అందించేలా పలు బ్లాక్ ఎలిమెంట్లను జోడించారు.
బ్లాక్ ORVMలు
గ్లాసీ బ్లాక్ ఫ్రంట్, రియర్ డిఫ్యూజర్లు
డ్యూయల్-టోన్ ఫ్లోటింగ్ బ్లాక్ రూఫ్
17-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్
బ్లాక్ స్కోడా లెటరింగ్
స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్
రియర్ స్పాయిలర్
సి-పిల్లర్‌పై స్పోర్ట్‌లైన్ గ్రాఫిక్స్
ఈ మార్పులు కైలాక్‌కు సాధారణ వేరియంట్లతో పోలిస్తే మరింత స్పోర్టీ, ప్రీమియం రూపాన్ని అందిస్తాయి.
ఇంటీరియర్‌లో డార్క్ థీమ్
కైలాక్ స్పోర్ట్‌లైన్ క్యాబిన్లో కూడా స్పోర్టీ థీమ్‌ను కొనసాగించారు. డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్, రూఫ్ లైనర్‌కు డార్క్ థీమ్ ఇచ్చారు. లెదరెట్ సీట్లపై స్పోర్ట్‌లైన్ బ్యాడ్జింగ్‌తో పాటు కాంట్రాస్ట్ స్టిచింగ్ ఉంటుంది. అల్యూమినియం పెడల్స్ కూడా క్యాబిన్లో స్పోర్టీ ఫీల్‌ను పెంచుతాయి.
ఫీచర్లకు కొదవ లేదు
కొత్త కైలాక్ స్పోర్ట్‌లైన్‌లో పలు ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో:
LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
యాంబియంట్ లైటింగ్
వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
క్లైమాటిక్ ఆటోమేటిక్ AC
10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
8-అంగుళాల వర్చువల్ కాక్‌పిట్
అదనంగా స్పోర్ట్‌లైన్ యాక్సెసరీస్ ప్యాక్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఫ్రంట్ బంపర్ కార్నర్ గార్నిష్, డార్క్ క్రోమ్ గ్రిల్ గార్నిష్, ఫెండర్ గార్నిష్, గ్లాసీ బ్లాక్ బాడీ-సైడ్ మోల్డింగ్స్ వంటి అంశాలు ఉన్నాయి.
తక్కువ ధర వేరియంట్లలోనూ అదనపు ఫీచర్లు
స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను మాత్రమే కాకుండా, కైలాక్లోని కొన్ని ఎంట్రీ-లెవల్ వేరియంట్లను కూడా స్కోడా అప్డేట్ చేసింది. క్లాసిక్, క్లాసిక్+ వేరియంట్లలో ఇప్పుడు క్లైమాట్రానిక్ ఆటోమేటిక్ AC, రియర్ డిఫాగర్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. భద్రత విషయంలోనూ కైలాక్ ప్రత్యేకంగా నిలుస్తుంది. అన్ని కైలాక్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అంతేకాకుండా కైలాక్ 5-స్టార్ NCAP భద్రతా రేటింగ్ సాధించింది. దీంతో ఫీచర్లు, డిజైన్‌తో పాటు సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చే SUV కొనుగోలుదారులను ఈ మోడల్ ఆకర్షించే అవకాశం ఉంది.
ఇంజన్, గేర్‌బాక్స్
స్కోడా కైలాక్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. వేరియంట్‌ను బట్టి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. కొత్త స్పోర్ట్‌లైన్ వేరియంట్ ద్వారా కైలాక్ లైనప్‌లో స్పోర్టీ డిజైన్, మెరుగైన ఫీచర్లు, భద్రతను కోరుకునే కస్టమర్ల కోసం స్కోడా మరో ఆకర్షణీయమైన ఎంపికను అందించింది. రూ.11-12 లక్షల ఎక్స్-షోరూమ్ ధర పరిధిలో SUV కోసం చూస్తున్న వారికి ఇది పరిశీలించదగిన ఆప్షన్‌గా మారింది.
తాజావార్తలు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!