NTV Telugu Site icon

Skoda Kylaq: స్కోడా కైలాక్ ధర, ఫీచర్లు, బుకింగ్స్ , డెలివరీ వివరాలు మీ కోసం..

Skoda Kylaq

Skoda Kylaq

Skoda Kylaq: స్కోడా ఆటో ఇండియా తొలిసారిగా తన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ని నవంబర్ 5న విడుదల చేసింది. MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కైలాక్ కార్ నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై కుషాక్, స్లావియా రూపుదిద్దుకుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉన్న స్కోడా, ఇదే ఫీచర్లను కైలాక్‌లో కూడా అందించబోతోంది.

స్కోడా కైలాక్ ధర రూ. 7.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. అయితే, తర్వాత పూర్తిగా ధరల జాబితా వెల్లడి చేయనుంది స్కోడా. కైలాక్ బుకింగ్స్ డిసెంబర్ 02 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు జనవరి 27, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇండియా కార్ మార్ మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO ఉన్నాయి. వీటికి కైలాక్ పోటీనివ్వబోతోంది.

డైమెన్షన్స్ పరంగా ..కైలాక్ కుషాక్ కంటే 230 మిమీ చిన్నగా ఉంటుంది. Kylaq పొడవు 3,995mm, వెడల్పు 1,783mm మరియు ఎత్తు 1,619mm, వీల్‌బేస్ 2,566mm కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 189mmగా ఉంది. కేవలం 1.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 115bhp, 178Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కైలాక్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ రెండింటినీ అందిస్తుంది. కైలాక్ గరిష్టంగా 188kmph వేగాన్ని అందుకోగలదని, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 10.5 సెకన్లలో 0-100kmph నుండి వేగాన్ని అందుకోగలదని స్కోడా పేర్కొంది.

Read Also: New Study: ‘‘జ్ఞాపకాలు మెదడుకు మాత్రమే పరిమితం కావు’’.. శరీరంలో ఇతర భాగాల్లో మెమోరీ ఫంక్షన్స్..

స్కోడా కార్లకు సంప్రదాయంగా ఉంటున్న రేడియేటర్ గ్రిల్ స్థానంలో D రిబ్స్‌తో బ్లాక్ గ్రిల్ ఉంటుంది. ముందు భాగంలో అల్యూమినియం యాక్సెంట్‌లతో కూడిన బోల్డ్ లోయర్ స్పాయిలర్ కూడా ఉంది. ముందు భాగంలో బ్లాక్ గ్రిల్ ఎలిమెంట్‌తో LED DRLలు అనుసంధానించబడ్డాయి. కైలాక్ 446-లీటర్ బూట్ కెపాసిటీతో ఈ సెగ్మెంట్‌లోనే అగ్రస్థానంలో ఉంది.

టచ్ బెస్డ్ క్లైమెట్ కంట్రోల్, 8-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్ సీట్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్‌కి వెంటిలేషన్ ఫీచర్‌ని కలిగి ఉంది. కైలాక్‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ మరియు ఇంటిగ్రేషన్, అలాగే కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఉన్నాయి. హై ఎండ్, మిడిల్ వేరియంట్లలో క్రూయిజ్ కంట్రోల్, సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్, సింగిల్ లేదా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డిజైన్‌తో లెథెరెట్ సీట్లు ఉంటాయి.

కైలాక్ మొత్తం 25కి పైగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్‌ఓవర్ ప్రొటెక్షన్, మోటార్ స్లిప్ రెగ్యులేషన్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డియాక్టివేషన్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు ఉన్నాయి.