2.0L టర్బో పెట్రోల్ ఇంజిన్, 201hp పవర్‌తో కొత్త Skoda Kodiaq Lounge లాంచ్..
- స్కోడా ఇండియా కోడియాక్ లైనప్‌లో కొత్త “కోడియాక్ లౌంజ్” వేరియంట్
- 2.0L టర్బో పెట్రోల్ ఇంజిన్ (201hp, 320Nm), 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో
- 5 సీటర్ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ. 39.99 లక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skoda Kodiaq Lounge: స్కోడా (Skoda) ఆటో ఇండియా కొత్త వేరియంట్‌తో కోడియాక్ SUV లైనప్‌ను విస్తరించింది. ఇందులో భాగంగా తాజాగా ‘కోడియాక్ లౌంజ్’ (Kodiaq Lounge) పేరుతో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్‌లైన్, సెలెక్షన్ L&K మోడళ్ల కంటే కింద స్థాయిలో లభిస్తోంది. ముఖ్యంగా ఈ వేరియంట్ 5 సీటర్ లేఅవుట్‌తో వస్తుండటం ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తుంది.
రూ. 3,04,000 వరకు MG కార్లపై భారీ తగ్గింపు.. ఏ కారుపై ఎంత ఎంత తగ్గిందంటే?
Also Read
- Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
- E3 Trion vs Ampere Magnus G Max: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒకదానికి 165KM రేంజ్, మరొకదానికి 52L స్టోరేజ్
- Top 5 Best-Selling Scooters in India: భారత్ లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు.. టాప్‌లో యాక్టివా
- Electric Scooter Features: మీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయా? చాలామంది రైడర్లకు తెలియవు!
కోడియాక్ లౌంజ్‌లో 18 అంగుళాల మజెనో అలాయ్ వీల్స్ అందించారు. మూన్ వైట్, మాజిక్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే రంగులలో ఈ కార్లు లభిస్తాయి. మిగతా హయ్యర్ వేరియంట్‌లలో అందించే రేస్ బ్లూ, వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే కలర్‌లు ఈ వేరియంట్‌లో లేవు. ఎంట్రీ లెవల్ SUV కావడంతో 360 డిగ్రీ కెమెరా, ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్, కాంటన్ మ్యూజిక్ సిస్టమ్, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో లేవు. అయితే, దీనిలో 10.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 100W 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్ లాంటి అవసరమైన ఫీచర్లు ఇచ్చారు. 5 సీటర్ కాబట్టి మూడో వరుస సీట్లు ఉండవు. ఇంటీరియర్‌లో గ్రే అండ్ ఫాక్స్ స్వేడ్ థీమ్ ఉపయోగించారు.
Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
ఇతర వేరియంట్‌ల మాదిరిగానే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ వేరియంట్‌లో కూడా లభిస్తోంది. దీనికి 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది. ఈ ఇంజిన్ 201 hp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కోడియాక్ లౌంజ్‌ను కంపెనీ రూ. 39.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక హయ్యర్ వేరియంట్ లలో స్పోర్ట్‌లైన్ రూ. 43.76 లక్షలు, సెలెక్షన్ L&K రూ. 45.96 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధరలకు విక్రయించబడుతున్నాయి.
తాజావార్తలు
-
AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
-
Sonia Gandhi: ‘బిలాంగింగ్’ పేరుతో సోనియాగాంధీ ఆత్మకథ.. రాజీవ్‌గాంధీతో ప్రేమ ముచ్చట్లు
-
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!