Skoda Kodiaq Lounge: స్కోడా (Skoda) ఆటో ఇండియా కొత్త వేరియంట్‌తో కోడియాక్ SUV లైనప్‌ను విస్తరించింది. ఇందులో భాగంగా తాజాగా ‘కోడియాక్ లౌంజ్’ (Kodiaq Lounge) పేరుతో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్‌లైన్, సెలెక్షన్ L&K మోడళ్ల కంటే కింద స్థాయిలో లభిస్తోంది. ముఖ్యంగా ఈ వేరియంట్ 5 సీటర్ లేఅవుట్‌తో వస్తుండటం ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తుంది.
రూ. 3,04,000 వరకు MG కార్లపై భారీ తగ్గింపు.. ఏ కారుపై ఎంత ఎంత తగ్గిందంటే?
కోడియాక్ లౌంజ్‌లో 18 అంగుళాల మజెనో అలాయ్ వీల్స్ అందించారు. మూన్ వైట్, మాజిక్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే రంగులలో ఈ కార్లు లభిస్తాయి. మిగతా హయ్యర్ వేరియంట్‌లలో అందించే రేస్ బ్లూ, వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే కలర్‌లు ఈ వేరియంట్‌లో లేవు. ఎంట్రీ లెవల్ SUV కావడంతో 360 డిగ్రీ కెమెరా, ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్, కాంటన్ మ్యూజిక్ సిస్టమ్, డ్రైవర్ డ్రౌసినెస్ డిటెక్షన్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో లేవు. అయితే, దీనిలో 10.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 100W 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్ లాంటి అవసరమైన ఫీచర్లు ఇచ్చారు. 5 సీటర్ కాబట్టి మూడో వరుస సీట్లు ఉండవు. ఇంటీరియర్‌లో గ్రే అండ్ ఫాక్స్ స్వేడ్ థీమ్ ఉపయోగించారు.
Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
ఇతర వేరియంట్‌ల మాదిరిగానే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ వేరియంట్‌లో కూడా లభిస్తోంది. దీనికి 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది. ఈ ఇంజిన్ 201 hp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కోడియాక్ లౌంజ్‌ను కంపెనీ రూ. 39.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక హయ్యర్ వేరియంట్ లలో స్పోర్ట్‌లైన్ రూ. 43.76 లక్షలు, సెలెక్షన్ L&K రూ. 45.96 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధరలకు విక్రయించబడుతున్నాయి.
