భద్రతలో తన సత్తాను నిరూపించుకున్న కంపెనీ స్కోడా. ఇటీవల తన కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్ (Kylaq) యొక్క మైలేజ్ గణాంకాలను విడుదల చేసింది. స్కోడా కైలాక్ యొక్క వివరాలను కంపెనీ పంచుకుంది. దాని ఏఆర్ఏఐ (ARAI)- రేటెడ్ మైలేజ్ గణాంకాలు కూడా వెల్లడయ్యాయి. ఈ గణాంకాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో బడ్జెట్ కస్టమర్లకు గొప్ప ఎంపికగా మారగలదు. ఈ కారు టాటా నెక్సాన్, వెన్యూ, సోనెట్, బ్రెజ్జా కంటే ఎక్కువ మైలేజీని ఇస్తోంది. దాని వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
READ MORE: Tata Car: రూ. 6.20 లక్షల ధర.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. ఈ టాటా కారు పేరిట మరో రికార్డు
స్కోడా కైలాక్ లో 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఒక లీటర్ పెట్రోల్‌పై కయాక్ 19.05 కి.మీలను అందజేస్తుందని ARAI ధృవీకరించింది.ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 19.68 కి.మీ. వరకు మైలేజీని ఇస్తుంది. స్కోడా కైలక్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోల్చినప్పుడు.. ఇది చాలా కార్ల కంటే మెరుగ్గా ఉంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జాతో పోలిస్తే, స్కొడా కైలక్ యొక్క మాన్యువల్ వెర్షన్ ఎక్కువ మైలేజీని ఇవ్వగలదు. అయితే.. స్కోడా కైలాక్ ఆటోమేటిక్ కంటే బ్రెజ్జా ఆటోమేటిక్ మోడల్ మాత్రం ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది.
READ MORE: Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్ కాదు..
ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు టాప్ 2 ట్రిమ్ స్థాయిలతో మాత్రమే అందుబాటులో ఉండగా, మిడ్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్ 5 ఇంచ్ టచ్‌స్క్రీన్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రు మెంట్ ప్యానెల్‌ని పొందుతుంది. బేస్ క్లాసిక్ వేరియంట్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని పొందుతుంది. కైలాక్ ప్రెస్టీజ్‌లో వెంటిలేషన్‌తో కూడిన 6-వే పవర్ అడ్జెస్టెబుల్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఆసక్తికరంగా, ప్రతి వేరియంట్ సింగిల్ లేదా డ్యూయల్ టోన్‌లో ప్రత్యేకమైన క్యాబిన్ అప్హోలిస్ట్రీని పొందుతుంది.
READ MORE: Maruti Suzuki Cars: డిజైర్ నుంచి వ్యాగన్ఆర్ వరకు.. పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. లిస్ట్ ఇదే..