NTV Telugu Site icon

Mahindra: మహీంద్రా కార్‌లకు భారీ డిమాండ్.. స్కార్కియో, , XUV 3XOలకు క్రేజ్..

Mahindra

Mahindra

Mahindra: మహీంద్రా ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. కంపెనీ ఫోర్ట్‌పోలియోలోని కొత్త XUV 3XO, బొలెరో, థార్, స్కార్పియో (N మరియు క్లాసిక్) మరియు XUV700లకు భారీ డిమాండ్ నెలకొంది. స్వదేశీ ఆటోమేకర్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకంగా 1,24,000 కంటే ఎక్కువ యూనిట్ల కార్‌లను విక్రయించింది. ఇయర్-ఓవర్-ఇయర్ (y-o-y) 24 శాతం వృద్ధిని కనబరించింది.

Read Also: Delhi fire: ఢిల్లీలో దారుణం.. మహిళను కాల్చి చంపిన దుండగుడు

మహీంద్రా ఎస్‌యూవీ వాహనాల్లో కొత్త XUV 3XO, బొలెరో, థార్, స్కార్పియో (N మరియు క్లాసిక్) మరియు XUV700 ఉన్నాయి. జూలై 1 నాటికి ఈ కంపెనీ కార్ల కోసం దాదాపుగా 1,78,000 ఒపెన్ బుకింగ్స్ కలిగి ఉంది. తొలి త్రైమాసికంగాలో అత్యధికంగా స్కార్పియో కోసం 58,000 ఓపెన్ బుకింగ్స్ కలిగి ఉంటే తర్వాతి స్థానంలో XUV 3XO 55,000 వద్ద బుకింగ్స్ కలిగి ఉంది. థార్ 42,000 ఓపెన్ బుకింగ్‌లను కలిగి ఉండగా, XUV700 మరియు బొలెరో వరుసగా 13,000 మరియు 8,000 బుకింగ్‌లను కలిగి ఉన్నాయి.

మహీంద్రా జూన్‌లో XUV 3XO కోసం 20,000 కొత్త బుకింగ్‌లను అందుకుంది. ఆ తర్వాత స్కార్పియో 12,000, XUV700కి 8,000, బొలెరోకి 6,000 మరియు థార్‌కి 5,000 కొత్త బుకింగ్‌లు వచ్చాయి. మహీంద్రా తన ఉత్పత్తి సామర్థ్యం విస్తరించడంతో ఎస్‌యూవీల్లో విపరీతమైన పెరుగుదలను చూసింది. 2020 ఆర్థిక సంవత్సరంలో నెలకు19,000 యూనిట్ల నుంచి 2024లో నెలకు 49,000 యూనిట్లకు పెరిగింది. 64,000 యూనిట్ల నెలవారీ తయారీ సామర్థ్యంలో ఆర్థిక సంవత్సరం 2025ని ముగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అదనపు 15,000 యూనిట్ల కార్‌లలో థార్ రోక్స్ 5-డోర్ మరియు XUV 3XO మరియు XUV400 కోసం 5,000 యూనిట్లు మరియు రాబోయే ఎలక్ట్రిక్ వాహనం(BEV) కోసం 10,000 యూనిట్లు ఉన్నాయి.