Site icon NTV Telugu

Car Prices Increase: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ఈ కంపెనీ కార్ల ధరలు..

Renault Kiger Facelift

Renault Kiger Facelift

Car Prices Increase: కొత్త ఏడాదిలో కార్లు ధరలు పెరగనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన వాహనాల ధరలను 2026 జనవరి నుంచి గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు మోడల్‌, వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఆటోమొబైల్ రంగంలో కొనసాగుతున్న ఆర్థిక సవాళ్లే ఈ నిర్ణయానికి కారణమని వివరించింది. భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించడంపై తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్‌లో పోటీని తట్టుకుని కంపెనీ విలువను కాపాడుతామని రెనాల్ట్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ధరలకే వాహనం కొనాలనుకునే వారు 2025 డిసెంబర్ ముగిసేలోపు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది.

READ MORE: Mahabubabad: తల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో.. కొడుకు షాకింగ్ డెసిషన్

కొత్త సంవత్సరం ముందు ద్రవ్యోల్బణం, సరఫరా ఖర్చులు, నియంత్రణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోవడానికి మెర్సిడెస్-బెంజ్, జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, నిస్సాన్, బీఎండబ్ల్యూ మోటొరాడ్ వంటి అనేక కంపెనీలు కూడా ధరల పెంపు ప్రకటించాయి. దీంతో ఈ కంపెనీ సైతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ గ్రూప్‌నకు అనుబంధ సంస్థగా రెనాల్ట్ ఇండియా పనిచేస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో క్విడ్, ట్రైబర్, కైగర్ అనే మూడు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ధరలు తక్కువగా ఉండటం, ఉపయోగకరమైన ఫీచర్లలో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

READ MORE: Jabalpur: జబల్పూర్‌ అగ్రి వర్సిటీలో దారుణం.. యువతిపై గ్యాంగ్‌రేప్

Exit mobile version