NTV Telugu Site icon

Maruti Suzuki: ఈ కారు ధర రూ. 4.26 లక్షలు.. 32 మైలేజీ.. కానీ..

Maruti S Presso

Maruti S Presso

మారుతి సుజుకీ కార్లు భారతీయ కస్టమర్లలో చాలా ప్రజాదరణ పొందాయి. మారుతి సుజుకీ వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో వంటి మోడళ్లను కూడా విపరీతంగా విక్రయిస్తోంది. ఒకవైపు, గత నెలలో అంటే డిసెంబర్ 2024లో మారుతి వ్యాగన్ఆర్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు 17,000 కంటే ఎక్కువ కస్టమర్‌లను పొందాయి. అదే సమయంలో కంపెనీ యొక్క చౌక హ్యాచ్‌బ్యాక్ S-Pressoను మాత్రం నెలలో కేవలం 8 మంది కస్టమర్‌లను మాత్రమే కొన్నారు. ఈ కాలంలో మారుతి ఎస్-ప్రెస్సో అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 86.67 శాతం క్షీణించాయి. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరను ఒకసారి పరిశీలిద్దాం..

READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్

మారుతి సుజుకి S-ప్రెస్సోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 68bhp శక్తిని, 89Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు సీఎన్‌జీలో కూడా అందుబాటులో ఉంది. CNG పవర్‌ట్రెయిన్‌తో కారు లీటరుకు 32.73 కిమీ మైలేజీని ఇస్తుంది! కారు లోపలి భాగంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ పవర్ విండో, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను పొందుతారు. భద్రత కోసం, కారులో స్పీడ్ అలర్ట్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మారుతి ఎస్-ప్రెస్సో యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షల వరకు ఉంది.

READ MORE:Viral Video: దెబ్బకు వైరల్‌ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)