మిడిల్ క్లాస్‌కు బెస్ట్ ఛాయిస్! తక్కువ ధర.. 110 కి.మీ రేంజ్‌తో OSM Vextr రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omega Seiki Vextr electric scooter: పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో జనాలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. కానీ.. ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. అయితే.. తాజాగా ఓమెగా సీకీ మొబిలిటీ ఓ కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఇప్పటివరకు ప్రధానంగా కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఓమెగా సీకీ మొబిలిటీ ఇప్పుడు సాధారణ వినియోగదారుల వైపు అడుగు వేసింది. తొలి అడుగులో భాగంగా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త స్కూటర్ పేరు OSM Vextr. ఇది కంపెనీ నుంచి వచ్చిన తొలి హైస్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్. దీని ధర రూ.99,900గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
READ MORE: Bhatti Vikramarka : మహాత్మా గాంధీ ఏ పాపం చేశారని ఉపాధి పథకంలో ఆయన పేరు తొలగించారు
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
వెక్స్ట్రా డిజైన్ సాధారణంగా కనిపించినా, ఇందులో ఉన్న ఫీచర్లు మాత్రం నేటి అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. స్కూటర్‌లో 3.5 అంగుళాల కలర్ ఎల్‌సీడీ స్క్రీన్ ఉంది. ఇందులో బ్యాటరీ ఎంత మిగిలి ఉంది, ఇంకా ఎంత దూరం వెళ్లొచ్చు, ప్రస్తుతం వేగం ఎంత అనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి లేదా చిన్న చిన్న ప్రయాణాలు చేసే వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 110 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. నగరంలో రోజూ తిరిగే వారికి ఇది సరిపడే రేంజ్. ట్రాఫిక్‌లో సులువుగా నడపడానికి అనువుగా దీనిని రూపొందించారు. కొండలు లేదా ఎత్తైన రోడ్లపై కూడా ఈ స్కూటర్ బాగానే పనిచేస్తుంది. సుమారు 12 డిగ్రీల వరకు ఉన్న ఎత్తైన దారులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కగలదు. చార్జింగ్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. ఇంట్లో ఉండే సాధారణ చార్జర్‌తోనే దీనిని చార్జ్ చేయొచ్చు. 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ కావడానికి నాలుగు గంటలు పడుతుంది. పూర్తిగా చార్జ్ కావాలంటే దాదాపు ఐదు గంటలు సరిపోతాయి. రాత్రి చార్జ్ పెట్టి ఉదయం వాడుకునే వారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
READ MORE: Pakistan: మా ఆర్మీ కన్నా బలూచ్‌ల వద్దే అత్యాధునిక ఆయుధాలు.. పాక్ రక్షణ మంత్రి ఆందోళన..
రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా చేయడానికి ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్‌లో ఎక్కువ రేంజ్ వస్తుంది. సిటీ మోడ్ రోజువారీ ప్రయాణాలకు సరిపోతుంది. స్పోర్ట్స్ మోడ్‌లో వేగం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవసరాన్ని బట్టి మోడ్ మార్చుకోవచ్చు. అదనంగా యూఎస్‌బీ చార్జింగ్ సదుపాయం ఉంది. ఫోన్ చార్జ్ అయిపోతుందేమో అనే భయం లేకుండా ప్రయాణించొచ్చు. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కూడా ఉంది. బరువైన స్కూటర్‌ను వెనక్కి తీసే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కావాలంటే జీఎస్‌ఎం కనెక్టివిటీ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ కొత్త స్కూటర్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఓమెగా సీకీ మొబిలిటీ భావిస్తోంది. ఇప్పటికే టియర్-1, టియర్-2, టియర్-3 నగరాల్లో కలిపి 200కు పైగా డీలర్‌షిప్‌ల ద్వారా వెక్స్ట్రాను విక్రయించాలనుకుంటోంది. భారత్‌కే పరిమితం కాకుండా ఆఫ్రికా దేశాలకు కూడా ఈ స్కూటర్‌ను ఎగుమతి చేసే ఆలోచనలో ఉంది కంపెనీ. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న తయారీ కేంద్రంలో వెక్స్ట్రా ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి 25 వేల స్కూటర్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇది మిడిల్ క్లాస్ పీపుల్స్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారనుంది.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!