దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అధికారికంగా దేశీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణి ఓలా రోడ్‌స్టర్‌ను విడుదల చేసింది. ఈ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో మొత్తం మూడు వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఈ వేరియంట్లన్నీ విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో వస్తున్నాయి.
READ MORE: Minister Farooq: మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు..
ఓలా రోడ్‌స్టర్ సిరీస్ ధర:
ఎంట్రీ లెవల్ వేరియంట్ రోడ్ స్టర్ ఎక్స్ మోడల్ 2.5kWh, 3.5kWh, 4.5kWh అనే మూడు బ్యాటరీ ప్యాక్‌లలో వస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 74,999, రూ. 84,999, రూ. 99,999 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). సింగిల్ ఛార్జ్‌తో ఇది గరిష్ఠంగా 200 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుందని, దీని టాప్ స్పీడ్ 124 కిలోమీటర్లుగా కంపెనీ తెలిపింది. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్ అమర్చారు. ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకుంటే.. వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే మిడ్ వేరియంట్ కూడా 3 kWh, 4.5kWh, 6kWh యొక్క మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో పరిచయం చేశారు. దీని ధర రూ. 1,04,999, రూ. 1,19,999 , రూ. 1,39,999 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు).
READ MORE:Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!
ఈ మోటార్ సైకిల్ డెలివరీలు కూడా జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ టాప్ స్పీడ్ 126 కిలోమీటర్లు. 3.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 151km, 4.5 kWhతో 190 కిలోమీటర్లు, 6kWh బ్యాటరీతో 248 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. ఇందులో 6.8 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే ఉంది. కంపెనీ కేవలం రెండు బ్యాటరీ ప్యాక్‌లతో 8kWh, 16kWhతో అధిక వేరియంట్ అంటే రోడ్‌స్టర్ ప్రోని పరిచయం చేసింది. దీని ధర వరుసగా రూ. 1,99,999, రూ. 2,49,999 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఈ బైక్ టాప్ స్పీడ్ 194 కిలోమీటర్లు. ఈ బైక్ డెలివరీలు 2025 దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ సింగిల్ ఛార్జ్‌తో 579 కిలోమీటర్లుగా పేర్కొంది. ఇందులో కూడా 10 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే అమర్చారు.