NTV Telugu Site icon

Diplos Max Electric Scooter: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140KM రేంజ్!

Numeros Motors

Numeros Motors

డబ్బులు ఆదా చేసుకోవాలంటే పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే ఆలోచనలో పడ్డారు వాహనదారులు. తక్కువ ప్రయాణ ఖర్చులు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవడం, పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది.ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది. న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ-యుటిలిటీ ఇ-స్కూటర్, డిప్లోస్ మాక్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 1,12,199 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది సింగిల్ ఛార్జ్ తో 140 కి.మీల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Also Read:Ola Electric: క్షీణించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ

స్టన్నింగ్ లుక్స్, పవర్ ఫుల్ బ్యారటీ ప్యాక్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్ ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. దీనిలో కంపెనీ 3.7kWh సామార్థ్యం గల లిథియం బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఈడీ స్ట్రిప్ లైట్ తో పాటు, దాని ముందు భాగంలో గుండ్రని ఆకారపు లైట్ కూడా అందించబడింది. ఇందులో యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లను అందించారు. డ్యుయల్ డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైటింగ్ తో వస్తోంది.