Site icon NTV Telugu

72 హెచ్‌పీ పవర్, AMT గేర్‌బాక్స్.. ఫిబ్రవరి 17న Nissan Gravite MPV లాంచ్

Nissan

Nissan

Nissan Gravite MPV: నిస్సాన్ ఇండియా తమ కొత్త గ్రావైట్ MPV (Nissan Gravite MPV)ను భారత మార్కెట్‌లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ మోడల్‌ను జనవరి 21న లాంచ్ చేయాల్సి ఉండగా, కారణాలు వెల్లడించకుండా కంపెనీ ఈ ఈవెంట్‌ను వాయిదా వేసింది. ఇదే తరహాలో నిస్సాన్ కొత్త మిడ్-సైజ్ SUV టెక్టన్ (Tekton) లాంచ్ కూడా వాయిదా పడింది. టెక్టన్‌ను ఈరోజే ఆవిష్కరించాల్సి ఉండగా, అది కూడా ఆలస్యం అయింది.

Read Also: Redmi Note 15 Pro+, Note 15 Pro సేల్స్‌ ప్రారంభం.. ఆఫర్స్‌.. ఫీచర్స్‌..

కొత్త మోడళ్లతో లైనప్:
గ్రావైట్ MPVతో నిస్సాన్ భారత మార్కెట్‌లో తన ప్రొడక్ట్ లైనప్‌ను విస్తరించాలనుకుంటోంది. గ్రావైట్ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే టెక్టన్ SUVని లాంచ్ చేయనుంది. అలాగే, 2027లో ఒక కొత్త 7-సీటర్ SUVను కూడా తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు నిస్సాన్ భారత మార్కెట్‌లో ప్రధానంగా మ్యాగ్నైట్ (Magnite) మోడల్ ద్వారానే పాపులర్ అయింది.

డిజైన్ హైలైట్స్:
గ్రావైట్ పూర్తి డిజైన్ ఇంకా బయటకు రాలేదు.. అయినప్పటికీ, నిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాలు వాహనానికి కొత్త లుక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ముందుభాగంలో కొత్త గ్రిల్, నిస్సాన్ లోగో, క్రోమ్ అక్సెంట్స్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అలాగే, కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో పాటు బోనెట్‌పై హుడ్ స్కూప్‌లా కనిపించే ఎలిమెంట్ వాహనానికి రగ్డ్ లుక్‌ను ఇస్తోంది.

Read Also: Varanasi Update: ‘అవతార్’తో పోల్చొద్దు.. జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్!

ఇంటీరియర్ & సీటింగ్:
అయితే, నిస్సాన్ గ్రావైట్‌లో డ్యాష్‌బోర్డ్‌లో కొత్త మెటీరియల్స్‌తో ఫ్రెష్ డిజైన్ ఉండే అవకాశం ఉంది. రెనాల్ట్ ట్రైబర్ (Triber)తో కొన్ని ఫీచర్లను పంచుకునే ఛాన్స్ ఉంది. అలాగే, మూడు వరుసల సీటింగ్ లేఅవుట్ తో రాబోతుంది. 5, 6 లేదా 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లను అందించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఫీచర్లు:
* 7-ఇంచ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
* Android Auto & Apple CarPlay సపోర్ట్
* వైర్‌లెస్ ఛార్జింగ్
* సెంటర్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్
* సెకండ్ రో సీట్లకు స్లైడ్ & రిక్లైన్ ఫంక్షన్

ఇంజిన్:
గ్రావైట్ MPVలో 1.0 లీటర్, 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు 72 హెచ్‌పీ పవర్, 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందించనున్నారు. ఇది ట్రైబర్‌లో ఉన్న సెటప్‌కు సమానంగా ఉండే అవకాశం ఉంది. డ్రైవబిలిటీ మెరుగుపర్చేందుకు నిస్సాన్ కొన్ని మార్పులు చేయవచ్చని సమాచారం.

Exit mobile version