NTV Telugu Site icon

Swift 2024: ఫోర్త్ జనరేషన్ మారుతి స్విఫ్ట్.. ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే..

Swift 2024

Swift 2024

Swift 2024: ఇండియాలో హ్యచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్‌కి ఉన్న క్రేజ్ వేరే కారుకు లేదు. తాజాగా మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ టోక్యో మోటార్ షో 2023(జపాన్ మొబిలిటీ షో 2023)లో తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం కాన్సెప్ట్ కారుగా పిలువబడుతున్న ఈ మోడల్ 2024లో ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో స్విఫ్ట్ కారుకు స్థిరమైన విక్రయాలు ఉన్నాయి. 2024(ఏప్రిల్-సెప్టెంబర్) ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు 1,03,500 కార్లను విక్రయించింది. బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లను కూడా స్విఫ్ట్ అధిగమించింది.

Read Also: Ponnam Prabahakar: ప్రతీ విషయంపై ట్విట్టర్‌లో స్పందించే కేసీఆర్ కుటుంబం.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించదు..

కొత్త స్విఫ్ట్ కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు కొత్త గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌తో సహా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా చాలా మార్పులు ఉన్నాయి. డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్ మరియు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా సాంకేతికతలను కూడా కలిగి ఉంది. ఇంటీరియర్ కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త ప్యానెల్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో రానుంది.

ఇంజన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియాలో స్విఫ్ట్ ఇంజన్ 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్‌తో 90hp గరిష్ట శక్తిని మరియు 113Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. రెండు ట్రాన్స్‌మిషన్ ఛాయిస్ లతో ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్లతో అందుబాటులో ఉంది. ఈ పవర్ ట్రెయిన్ స్విఫ్ట్ 2024 లోనూ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్విఫ్ట్ ధర రూ. 5,99,450 నుంచి రూ. 9,03,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, 2024లో కొత్త స్విఫ్ట్‌ను ప్రవేశపెట్టడంతో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.