NTV Telugu Site icon

Maruti Suzuki Brezza 2022: న్యూ బ్రెజ్జాకు సూపర్ రెస్పాన్స్..8 రోజుల్లోనే 45,000 బుకింగ్స్

Brezza 2022

Brezza 2022

గురువారం మారుతి సుజుకీ నుంచి ‘బ్రెజ్జా 2022’ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్ ఇండియాలో లాంచ్ అయింది. గతంలోని తన ‘విటారా బ్రెజ్జా’ కన్నా ఆధునాతన ఫీచర్లలో ఇండియాలో లాంచ్ అయింది. గతంలో కన్న మరింత స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తో అట్రాక్టివ్ గా ఉంది కొత్త బ్రెజ్జా 2022.

విడుదలకు ముందే మారుతి సుజుకీ బ్రెజ్జా 2022 రికార్డ్ క్రిమేట్ చేస్తోంది. ఊహించని విధంగా ఈ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్ కు వినియోగదారుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 8 రోజుల్లోనే 45,000 కన్నా ఎక్కువ కార్లు బుక్ అయ్యాయి. అంటే సగటున రోజుకు 7,500 కార్లు బుక్ అవుతున్నాయి.

Read Also: Maruti Suzuki Brezza: సరికొత్త ఫీచర్లతో లాంచ్ అయిన బ్రేజ్జా 2022

ఇంటీరియర్ తో పాటు ఎక్స్టీరియర్ లుక్ ను మరింత స్టైలిష్ గా తీర్చిదిద్దింది మారుతీ సుజుకి. డ్యుయట్ టోన్ ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, హెడ్స్ అప్ డిస్ ప్లే, అండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టవిటీతో 9 ఇంచుల టన్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే యూనిట్ , 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫిచర్లు కొత్త బ్రెజ్జా 2022లో ఉన్నాయి. మొత్తం 19 రకాల సెక్యురిటీ ఫీచర్లను కార్ లో పొందుపరిచారు.

ప్రస్తుతం మార్కెట్ లో కాంపాక్ట్ ఎస్ యూ వీ విభాగంలో కింగ్ గా ఉన్న టాటా నెక్సాన్ తో పాటు హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రోనో కిగర్, కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది మారుతి సుజుకీ బ్రెజ్జా 2022.