Mahindra Bolero Pik-Up: భారత కమర్షియల్ వాహన మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా మహీంద్రా & మహీంద్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ప్రముఖ వాణిజ్య వాహనం మహీంద్రా బొలెరో పిక్-అప్ (Mahindra Bolero Pik-Up)ను తాజా అప్‌డేట్స్‌తో అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ అప్డేట్స్ ప్రధానంగా డ్రైవర్ కంఫర్ట్, అన్ని వాతావరణాలకు అనుకూలత, ప్రాక్టికాలిటీపై దృష్టి సారించాయి.
కమర్షియల్ యూజర్లకు స్మార్ట్ ఎంపిక.. iMAXX టెలిమాటిక్స్‌తో Mahindra Bolero Camper అప్డేట్..!
అప్డేటెడ్ బొలెరో పిక్-అప్‌లో ముందుగా గమనించదగిన మార్పు కొత్త ఫ్రంట్ డిజైన్. ఇది వాహనానికి మరింత ఫ్రెష్, మోడర్న్ లుక్‌ను అందిస్తోంది. వీటితోపాటు డ్రైవర్ సౌకర్యాన్ని పెంచేందుకు రిక్లైనర్ డ్రైవర్ సీట్ (హెడ్‌రెస్ట్ కలిపి)ను అందించారు. అలాగే, వెడల్పైన కో-డ్రైవర్ సీట్‌ను కూడా అందించండం వల్ల దురా ప్రయాణాల్లో అలసట తగ్గేలా డిజైన్ చేశారు. ఈసారి ఇందులో కీలకమైన అప్గ్రేడ్ గా ఎయిర్ కండిషనింగ్ (AC), హీటింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. దీని వల్ల వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం లభిస్తూ అన్ని వాతావరణ పరిస్థితుల్లో వాహనాన్ని సౌకర్యవంతంగా నడపవచ్చు. కమర్షియల్ యూజర్లకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్.
బండి పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ బలమైన పనితీరు, దీర్ఘకాలిక నమ్మకత్వంతో కొనసాగుతుంది. భారత మార్కెట్లో ఇది 2WD, 4WD ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల, వివిధ రకాల వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ధరల పరంగా కూడా మహీంద్రా బొలెరో పిక్-అప్‌ను కమర్షియల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ వాహనం ధరలు రూ. 9.19 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 9.99 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). మొత్తంగా తాజా అప్‌డేట్స్‌తో మహీంద్రా బొలెరో పిక్-అప్ ఇప్పుడు మరింత కంఫర్టబుల్, అన్ని వాతావరణాలకు సరిపోయే కమర్షియల్ వాహనంగా మారింది.
