Site icon NTV Telugu

New Kia Seltos: లాంచ్‌కు ముందే రోడ్డెక్కిన కియా.. మొదలైన New Seltos 2026 ప్రొడక్షన్..!

Kia

Kia

New Kia Seltos: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం ప్లాంట్‌లో ఆల్-న్యూ Seltos ఉత్పత్తిని అధికారికంగా కియా ఇండియా ప్రారంభించింది. దీంతో భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న మిడ్-SUV సెగ్మెంట్‌లో కియా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటుంది. 2019లో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీ నుంచే కియా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ ఏడాది నుంచే Seltos ఉత్పత్తి కూడా ఇక్కడ జరుగుతుండగా, ఇప్పుడు కొత్త తరం అప్‌గ్రేడ్ వెర్షన్ తయారీ దశలోకి ప్రవేశించింది. కాగా, కియా రీడిజైన్ చేసిన Seltos ధరలను జనవరి 2, 2026న అధికారికంగా ప్రకటించనున్నట్టు వెల్లడించింది. 2019 నుంచి కియా ఇండియా పోర్ట్‌ఫోలియోకు ప్రధాన బలంగా నిలిచిన Seltos, ఈ కొత్త జనరేషన్‌లో భారత వినియోగదారుల అంచనాలు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మరింత రూపుదిద్దుకుంది.

Read Also: Oppo Reno 15 Launch: జనవరి 8న మూడు ‘ఒప్పో’ ఫోన్‌లు లాంచ్.. స్పెక్స్, ధర డీటెయిల్స్ ఇవే!

అయితే, కొత్త కియా Seltos కారు లోపల ఎక్కువ స్థలం, మెరుగైన స్టెబిలిటీ, డ్రైవింగ్ బ్యాలెన్స్‌ను అందించేలా రూపొందించారు. SUV ఇప్పుడు 4,460 mm పొడవు, 1,830 mm వెడల్పు, 2,690 mm వీల్‌బేస్‌తో అందుబాటులోకి రాబోతుంది. ఈ మార్పుల వల్ల క్యాబిన్ కంఫర్ట్ మరింత మెరుగుపడి, డ్రైవింగ్ స్థిరత్వం పెరుగుతుందని కియా పేర్కొంది. డిజైన్ పరంగా, కియా యొక్క “Opposites United” ఫిలాసఫీ ఆధారంగా SUV లుక్‌ను పూర్తిగా అప్‌డేట్ చేశారు. ఇందులో అప్‌డేట్ అయిన Digital Tiger Face, వెల్‌కమ్ ఫంక్షన్‌తో LED ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, మస్క్యులర్ బాడీ సిల్హౌట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి Seltos కారుకు రోడ్డుపై మరింత పవర్‌ఫుల్ & ఆధునిక గుర్తింపును ఇస్తాయని కంపెనీ తెలిపింది.

Read Also: Security Guard Damages Car: కారుపై తన కోపాన్ని ప్రదర్శించిన సెక్యూరిటీ గార్డ్.. తుక్కు తుక్కైన కారు

ఈ సందర్భంగా Kia India Managing Director & CEO గ్వాంగ్గు లీ మాట్లాడుతూ.. ఆల్-న్యూ Seltos విడుదల, కియా ఇండియాకు గర్వకారణమైందన్నారు. మిడ్-SUV సెగ్మెంట్‌లో Seltos ఇప్పటికే ఎన్నో బెంచ్‌మార్క్‌లు సృష్టించింది. ఈ కొత్త జనరేషన్, భారత కస్టమర్ల అభిప్రాయాలు, అవసరాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రూపొందిన బిగ్ & ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ అని పేర్కొన్నారు. అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో, ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ లేకుండా డెలివరీలు అందించేందుకు మా టీమ్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కొత్త Seltos సెగ్మెంట్ అంచనాలను మరోసారి మార్చే శక్తి కలిగి ఉందని లీ చెప్పుకొచ్చారు.

కొత్త Kia Seltos లో మూడు ఇంజిన్ ఆప్షన్లు..
* Smartstream G1.5 Petrol – 115 PS, 144 Nm
* Smartstream 1.5 T-GDI Petrol – 160 PS, 253 Nm
* 1.5 CRDi VGT Diesel – 116 PS, 250 Nm

ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు 6MT, 6iMT, IVT, 7DCT, 6AT రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి కస్టమర్లకు పవర్, స్మూత్ డ్రైవింగ్, ఫ్లెక్సిబుల్ పెర్ఫార్మెన్స్ అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే, కస్టమర్లు 4 ప్రధాన ట్రిమ్స్- HTE, HTK, HTX, GTX మోడల్స్ నుంచి ఎంచుకోవచ్చు. అదనంగా HTE(O), HTK(O), HTX(A), GTX(A) ఆప్షన్ వేరియంట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. GTX & GTX(A) వేరియంట్లకు ప్రత్యేకంగా X-Line Styling Pack అందిస్తుండగా, Convenience, Premium, ADAS, X-Line Add-On Packs ద్వారా SUV లను పూర్తిగా తమకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకునే అవకాశం కియా కల్పించింది. అయితే, ఉత్పత్తి ప్రారంభం, కొత్త డిజైన్, పెరిగిన క్యాబిన్ స్పేస్, 3 ఇంజిన్ ఎంపికలు, 5 ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు, అధునాతన ఫీచర్లతో పర్సనలైజేషన్ ప్యాకేజీలతో కియా మరోసారి మిడ్-SUV సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించేందుకు రెడీ అవుతుంది.

Exit mobile version